Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

13 Jun, 2022 16:54 IST|Sakshi

1. కాంగ్రెస్‌ నిరసనలు.. రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మూడు గంటలపాటు రాహుల్‌ను ఏకధాటిగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. లంచ్‌ విరామం అనంతరం మళ్లీ ప్రశ్నించారు. ఈ మధ్యలో ఆయన కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన తల్లి సోనియా గాంధీని కలిసి వచ్చారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు


వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి.. అందులోకి మరిన్ని వైద్య చిక్సితలను చేర్చాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. సోనీ, జియో చేతికి ఐపీఎల్‌ ప్రసార హక్కులు

ఐపీఎల్‌ ప్రసార హక్కులను సోనీ, జియో సంస్థలు దక్కించుకున్నాయి. 2023-2027 కాలానికి గాను టెలికాస్టింగ్‌ రైట్స్‌ రూ. 44,075 కోట్లకు ఆమ్ముడు పోయిటన్లు సమాచారం. బుల్లితెర ప్రసార హక్కులను రూ. 23,575 కోట్లకు సోనీ దక్కించుకోగా.. డిజిటల్‌ ప్రసార హక్కులను రూ. 20,500 కోట్లకు జియో సొంతం​చేసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.  సిగరెట్‌ ప్యాక్‌ మీదే కాదు.. ప్రతి సిగరెట్‌ పైనా హెచ్చరిక

పోనుపోను పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్‌ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: రేవంత్‌


నేషనల్‌హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని   తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.  హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌ ఎదుట రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గాంధీ కుటుంబంపై బీజేపీ అక్రమ కేసులు పెడుతోంది. సోనియా గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ఈడీ అధికారులపై ఒత్తిడి కోసం కాంగ్రెస్‌ కుట్ర: స్మృతీ ఇరానీ


అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు.  గాంధీ ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చిందని విమర్శించారు.  
 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే!: మంత్రి జోగి రమేష్‌


పచ్చి అబద్ధాలతో పచ్చ రాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌. రామోజీరావుకు అబద్ధాలు మాత్రమే కనిపిస్తాయని, చంద్రబాబు పాలనలో ఏం జరగకపోయినా ఆయనకే ఓటేయాలంటాడని మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు.
 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. స్టాక్‌ మార్కెట్లో బ్లడ్‌ బాత్‌! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి!


సోమవారం మొత్తం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల‍్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్‌ బాత్‌ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. బ్రహ్మాస్త్ర కోసం మెగాస్టార్‌ వాయిస్‌ ఓవర్‌

బాలీవుడ్‌ భారీ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర టీజర్‌తో పాటు నటీనటుల లుక్స్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో వదిలింది. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్‌ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. ఇది నిజమా? గూగుల్‌ అలాంటి పని చేస్తోందా ఏమిటీ!?


సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంటే దాని ఫలితాలు ఎంజాయ్‌ చేస్తున్నాం. కానీ ఈ ఏ రంగంలో అయినా అతికి వెళితే చివరకు అది మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే భయాలు లేకపోలేదు. ఇప్పుడు అటువంటి తరుణమే వచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్‌ పోస్టు తాజాగా ప్రచురించిన కథనం ఇందుకు సంకేతామా?
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి
 

మరిన్ని వార్తలు