Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

1 Jun, 2022 16:56 IST|Sakshi

1. ‘ఏసీబీ యాప్‌’ను ప్రారంభించిన సీఎం జగన్‌.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే?
అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్‌ తయారు చేసింది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం'
ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. PM Modi-Amit Shah: తెలంగాణకు ప్రధాని మోదీ, అమిత్‌ షా.. మూడు రోజులు మకాం
తెలంగాణలో కొద్ది రోజుల నుంచి రాజకీయాలు వేడెక్కాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో పాలిటిక్స్‌ జోరందుకున్నాయి.  ఈ క్రమంలోనే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. సోనియా, రాహుల్‌గాంధీకి ఈడీ సమన్లు.. కాంగ్రెస్‌ స్పందన ఇది!
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్‌ గాంధీని, జూన్‌ 8వ తేదీ లోపు సోనియా గాంధీని విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. శవం కూడా దక్కది అనుకుంటే.. మృత్యుంజయురాలిగా మళ్లీ ఈ లోకంలోకి..
 పాలబుగ్గల చిన్నారి.. స్నేహితులతో ఆటల్లో మునిగిపోయింది. సరదాగా హైడ్ అండ్‌ సీక్‌ ఆడుతూ.. ఒక్కసారిగా చెట్టు చాటు నుంచి స్నేహితురాలిని సర్‌ప్రైజ్‌ చేద్దాం అనుకుంది. కానీ, ఊహించని సర్‌ప్రైజ్‌ ఆమెకు ఎదురైంది. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. అదృష్టంకొద్దీ ప్రాణం మిగలడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్‌ మస్క్‌
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ సంచలనాలకు కేంద్ర బిందువు. విచిత్ర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సమాకాలిన అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడిస్తుంటారు. అంతటి ఎలాన్‌ మస్క్‌ కూడా కొన్ని విషయాల్లో గోప్యత పాటిస్తుంటాడు. సెలబ్రిటీ హోదాలో కెమెరా కంటికి చిక్కకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు?
ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఓటమి పాలైంది. వరణుడి అడ్డంకి కారణంగా డీఎల్‌ఎస్‌ పద్ధతిలో నిర్వహించిన 45 ఓవర్ల మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Trolls On Rupankar Bagchi: ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్‌.. నెట్టింట ట్రోలింగ్‌
సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. కానీ ఆయన గొంతు సవరించుకుని పాడే పాటలకు దేశమే ఫిదా అయింది. సౌత్‌ నుంచి నార్త్‌ దాకా ఎన్నో భాషల్లో పాటలు పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రేమగీతాల కంటే విరహ గీతాలతోనే బాగా పాపులర్‌ అయ్యారు. కానీ అర్ధాంతరంగా ఆయన గొంతు మూగబోయింది.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Usha Jey: 20 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి.. ఇప్పుడు!
శ్రద్దాశక్తులతో శ్రమటోడిస్తేగానీ భరతనాట్యం రాదు. అంతటి కష్టమైన భంగిమలకు వెస్ట్రన్‌ హిప్‌హప్‌ను జోడించి ఆడియెన్స్‌ను అలరిస్తోంది ఉషా జే. సంప్రదాయ చీరకట్టులో భరతనాట్యానికి వెస్ట్రన్‌ డ్యాన్స్‌∙జోడించి చేస్తోన్న వీడియోలు నెటిజన్లచేత  ఔరా అనిపిస్తున్నాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్‌ దోపిడి కేసులో కొత్త కోణం
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్‌ దోపిడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బ్యాంకు మేనేజర్‌ స్రవంతిని పోలీసులు విచారించగా వెలుగులోకి ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఫిన్‌ కేర్‌ బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన కిలోకు పైగా బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి క్యాష్‌ చేస్తుకుంది మేనేజర్‌ స్రవంతి.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

మరిన్ని వార్తలు