Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

22 Jun, 2022 17:00 IST|Sakshi

1.. CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. Maharashtra Political Crisis: మీడియాకు చిక్కిన ఏక్‌నాథ్‌ షిండే.. పరుగే పరుగు!
ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్‌ షిండే
(58) మీడియా కంటపడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. Maharashtra Political Crisis: రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్తలు
మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్‌లోని సూరత్‌ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్‌ టాపిక్‌గా మారింది. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. CM Jagan Srikakulam Tour: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5..: నేనైతే పంత్‌ కెప్టెన్‌ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! 
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌గా నియమించాల్సి కాదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌ లాల్‌ అన్నాడు. తనకే గనుక అధికారం ఉండి ఉంటే కచ్చితంగా 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేసేవాడిని కాదన్నాడు. ఆటగాడిగా పంత్‌ మరింత మెరుగుపడాల్సి ఉందని, పూర్తి స్థాయిలో పరిణతి చెందిన తర్వాతే కెప్టెన్‌గా భారాన్ని మోయగలుగుతాడని అభిప్రాయపడ్డాడు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. Chinmayi Sripada: ఎలా కన్నావని అడుగుతున్నారు? వారికి నా ఆన్సరేంటంటే..
ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది సింగర్‌.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. దటీజ్‌ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్‌!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్‌ కార్పోరేట్‌ కంపెనీలు  తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్‌బై చెప్పింది. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. భారత్‌, చైనా, జపాన్‌లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి
సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్‌ కెప్టెన్‌ మోనికా ఖన్నా. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. 'ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
ఫోన్‌ నెంబర్‌ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్‌ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు