Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

26 May, 2022 17:00 IST|Sakshi

1..షిండ్లర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను సందర్శించిన సీఎం జగన్‌
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో భాగంగా దావోస్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈవోలు, ఫౌండర్లు, ఇతర టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూరికార్డుల సర్వే, డీకార్బనైజ్డ్‌ సెక్టార్‌లో ఇన్వెస్టర్లను ఆకర్షించ గలిగారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2..‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’
జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నాకు మీపై నమ్మకం ఉంది. మీకు మీపై నమ్మకం ఉందా?: ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అకడమిక్‌ డ్రెస్‌లో వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కాలర్లకు ఎక్సలెన్స్‌, లీడర్‌షిప్‌ అవార్డులు ప్రధానం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4..Twitter: తప్పు చేశావ్‌ ట్విటర్‌! రూ.1163 కోట్ల ఫైన్‌ కట్టాల్సిందే?
మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌కి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. చేసిన తప్పులకు జరిమానాగా 150 మిలియన్‌ డాలర్లు (రూ. 1,163 కోట్లు) ఫైన్‌ కట్టాలంటూ తీర్పు ఇచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6..BJP chief Chandrakant Patil: మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాటిల్ వివాదంలో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6..తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిమయం.. రాబోయేది బీజేపీ సర్కార్‌: ప్రధాని మోదీ
తెలంగాణ వచ్చిన ప్రతీసారీ ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని.. ముందుగా బీజేపీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశ సభలో ప్రసంగించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7..Hrithik Roshan: లవర్స్‌తో వచ్చిన మాజీ హృతిక్‌ దంపతులు, ఫొటోలు వైరల్‌
బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ బుధవారం(మే 25న) 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెలబ్రిటీలకు గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, విజయ్‌ దేవరకొండ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటివారికి సైతం ఆహ్వానాలు అందాయి. అటు బాలీవుడ్‌ హీరోహీరోయిన్లతో పాటు స్టార్‌ కపుల్‌ విక్కీ కౌశల్‌- కత్రినా కైఫ్‌ సైతం హాజరయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. Virat Kohli: ఇంకా రెండు అడుగులు..రెండే! కోచ్‌తో కోహ్లి.. వీడియో వైరల్‌
ఎలిమినేటర్‌ గండాన్ని అధిగమించి ఐపీఎల్‌-2022 క్వాలిఫైయర్‌-2కు చేరుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. సంతోషంతో ఆర్సీబీ ఆటగాళ్లు, సిబ్బంది ముఖం వెలిగిపోయింది. ఒకరినొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. వరుసగా  రెండో రోజూ తగ్గిన పసిడి ధర, ఎంత తగ్గిందంటే..
పసిడి ధరలు వరుసగా  రెండో  రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీరేట్లను  పెద్దగా పెంచకపోవచ్చనే పెంచనుందన్న సంకేతాల నడుమ గురువారం  బంగారం ధరలు క్షీణించాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల దన్ను, డాలరు మారకంలో దేశీయ  రూపాయి బలంతో  పసిడి పుంజుకుంది.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. Kalyani: ఒక్క 20 నిమిషాలు అమ్మతో మాట్లాడి ఉంటే ఆమె బతికి ఉండేది! నేను కూడా..
ఒక్క ఇరవై నిమిషాలు అమ్మతో ఉండి ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయేది కాదు. అమ్మలా చాలామంది మానసిక ఆందోళనతో నూరేళ్ల జీవితానికి అర్థాంతరంగా ముగింపు పలుకుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వారిలో యువత ఎక్కువగా ఉంటుంది. వీరిని మానసికంగా దృఢపరిచేందుకు ‘మానసిక హెల్త్‌ హెల్ప్‌లైన్‌’ చాలా అవసరం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు