Top Trending News: టుడే ఈవినింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

28 Sep, 2022 18:29 IST|Sakshi

1. గడప గడపకు.. నిర్లక్ష్యం వద్దు: సీఎం జగన్‌

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా..  ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,  పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించి.. దిశానిర్దేశం చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2.కాంగ్రెస్‌కు విజన్‌ లేదు.. గెలిచేంత సీన్‌ లేదు

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు గాంధీ కుటుంబంపై వ్యతిరేకత.. మరోవైపు అధ్యక్ష ఎన్నికల వేడి.. పార్టీని కుదేలు చేస్తోంది.  ఇప్పటికే సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్తున్నారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం వాళ్లు.. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. పాస్‌పోర్ట్ అప్లికేషన్.. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇక ఈజీ

పాస్‌ పోర్ట్‌ కోసం అప్లయ్‌ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌ల కోసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

4. స్టార్‌ ప్లేయర్‌లకు దక్కనిది.. మనోడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. సాకర్‌లో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

5. విశాఖ రైల్వే జోన్‌కి కట్టుబడి ఉన్నాం: కేంద్ర రైల్వే శాఖ మంత్రి

రైల్వే జోన్‌ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది అని ఆయన తెలియజేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

6. చిరుత టూ ఆర్ఆర్ఆర్..చిరు ఎమోషనల్‌

మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్‌ చరణ్‌పై తన ప్రేమను చాటుకున్నారు. అప్పుడే నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర‍్భంగా ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని చిరు ఆనందం వ్యక్తం చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

7. కమలా హ్యారీస్‌ టూర్‌.. నార్త్‌ కొరియా మిస్సైల్‌ ప్రయోగం

ఉత్తర కొరియా అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయోగం యూఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ దక్షిణ  కొరియా పర్యటనకు ముందు రోజే జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

8. DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

పండుగ సీజన్‌ వేళ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్‌ అలవెన్స్‌(డీఏ)ను పెంచుతూ కేబినెట్‌ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌ ప్రకటన

సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్ర‌క‌టించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ద‌స‌రా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికుల‌కు రూ. 368 కోట్ల‌ను సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10.కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో డిగ్గీ రాజా!

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రేసులో సీనియర్‌ నేత శశిథరూర్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ఉండనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత దిగ్విజయ్‌ సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో ఆయన సైతం ఉన్నారని, గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

మరిన్ని వార్తలు