Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

2 Jun, 2022 16:49 IST|Sakshi

1. Divyavani On Chandrababu Naidu: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి
టీడీపీ మాజీ నాయకురాలు దివ్యవాణి తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకీ రాజీనామా చేసిన తర్వాత ‘సాక్షి’తో మాట్లాడిన దివ్యవాణి.. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం జగన్‌.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. చార్మినార్‌ నమాజ్‌ సంతకాల సేకరణ.. బండి సంజయ్‌ మండిపాటు
చార్మినార్‌లో నమాజ్‌ కోసం సంతకాల సేకరణపై రాజకీయ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్‌ నేత రషీద్‌ఖాన్‌ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Sheryl Sandberg: మాజీ బాయ్‌ ఫ్రెండ్‌కోసమే మెటాకు షాక్‌?
ఫేస్‌బుక్‌ మెటా సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ ఆకస్మిక నిష్క్రమణ టెక్‌ వర్గాల్లో సంచలనం రేపింది. సంస్థనుంచి వైదొలగుతున్నట్టు ఆకస్మికంగా ప్రకటించారు.  అయితే భవిష్యత్తును ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, ప్రధానంగా కుటుంబానికి,  సేవా కార్యక్రమాలకు తన సమయాన్ని కేటాయిస్తానని ఫేస్‌బుక్‌లో తెలిపారు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి..
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మరి అబ్బాయి, అమ్మాయిలకే పెళ్లిళ్లు నిశ్చయిస్తారా? అమ్మాయి, అమ్మాయి.. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం కూడా మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. జెండర్‌ ఏదైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం కామన్‌ పాయింట్‌.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Geetu Royal: ఆస్ట్రేలియా ఆఫర్‌, భారీ రెమ్యునరేషన్‌, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!
ఈ మధ్య బుల్లితెర మీద తెగ సందడి చేస్తోంది గీతూ రాయల్‌. ఆ మధ్య టిక్‌టాక్‌ వీడియోలతో, తర్వాత బిగ్‌బాస్‌ రివ్యూలతో బాగా ఫేమస్‌ అయిందీవిడ. చిత్తూరు యాసలో గలగలా మాట్లాడుతూ గలాటా గీతూగా పేరు తెచ్చుకుంది. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్‌ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!
: ఐపీఎల్‌ మెగావేలం-2022కు ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఏడు కోట్ల రూపాయలకు రిటైన్‌ చేసుకుంది. గత సీజన్‌లో పర్పుల్‌ క్యాప్‌ గెలిచిన హర్షల్‌ పటేల్‌ను కాదని సిరాజ్‌ను అట్టిపెట్టుకుంది. అయితే, వేలంలో 10.75 కోట్లు వెచ్చించి అతడిని మళ్లీ కొనుగోలు చేసింది. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. మీకెందుకయ్యా కార్లు అన్న ‘ఫోర్డ్‌’.. ఇండియా సత్తా చూపిన రతన్‌టాటా
దేశమన్నా ఇక్కడి ప్రజలన్నా అమితంగా ఇష్టపడే రతన్‌టాటా ఓ విదేశీ కంపెనీ భారతీయులపై చూపించిన తల పొగరుకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను బిర్లాల కుటుంబ సభ్యుడు వేదాంత్‌ బిర్లా ట్విటర్‌లో షేర్‌ చేశారు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Job Opportunities: ‘చిప్స్‌’.. ఇప్పుడు హాట్‌టాపిక్‌! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు!
‘శుభాకాంక్షలు’ తెలియజేసే ఛీర్‌... హిప్‌ హిప్‌ హుర్రే. ఇప్పుడు అదే ఛీర్‌తో భవిష్యత్‌కాల శుభ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ‘చిప్‌ చిప్‌ హుర్రే’ అంటుంది యూత్‌. ఎందుకంటే...పరాధీనతకు చరమగీతం పాడడానికి, సెమికండక్టర్‌ చిప్‌ల తయారీవ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. డెలివరీ బాయ్‌ వికృత చేష్టలు.. యువతులకు అసభ్యకర వీడియోలు పంపి..
ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా అశ్లీల చిత్రాల వీడియోలను పంపుతున్న వ్యక్తిని బుధవారం ఆగ్నేయ విభాగ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌చేశారు. మడివాళ బైబీమ్‌ నగరలో ఉండే 40 ఏళ్ల ఫుడ్‌ డెలివరి బాయ్‌ నిందితుడు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు