Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

12 Jun, 2022 09:59 IST|Sakshi

1AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ 


‘మనం వేసిందే ఫొటో.. రాసిందే వార్త.. నిజానిజాలు దేవుడికెరుక.. రాష్ట్రంలో సగం మందినైనా నమ్మించగలిగితే మన బాబుకు మేలు చేసినట్లే..’ అనే సిద్ధాంతంతో ‘ఈనాడు’ దినపత్రిక వాస్తవాలకు మసి పూస్తోంది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి


2. Russia-Ukraine war: ఉక్రెయిన్‌పైకి ప్రాణాంతక ఆయుధాలు


కీవ్‌: భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్‌ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్‌ మిస్పైళ్లతో పాటు అణు వార్‌హెడ్లతో కూడిన కేహెచ్‌–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు..


రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. TS TET 2022: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్‌ పరీక్ష..


 ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్‌ ధనిక జంతువులు ఇవేనండి!


డాలర్లైనా, రష్యన్‌ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Dengue Fever: హైదరాబాద్‌ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్‌ వేసుకుంటే కాటేస్తాయి


దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Upasana: ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన


 హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్‌ అయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్‌గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. SL vs AUS: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..!


ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్‌ దసున్‌ షనక (25 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9టెక్నాలజీ వేసిన బాట.. ట్రావెలర్స్‌కి వరాల మూట..


వంట అనగానే ఉల్లిపాయ ముక్కల దగ్గర నుంచి.. అల్లం, కొత్తమీర తురుము వరకూ ప్రతీది అవసరమే. ఇంట్లో అయితే తీరిగ్గా చాకు తీసుకుని కట్‌ చేయడమో, మిక్సీ పట్టుకోవడమో చేస్తుంటాం. కానీ క్యాంపింగ్‌లో అవన్నీ సాధ్యం కాదుlకదా! అందుకే ఈ మినీ చాపర్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్‌ స్ట్రీమింగ్‌


మధ్యప్రదేశ్‌లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్‌ నగరంలో  స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్‌లో స్ట్రీమ్‌ చేసి రాక్షస ఆనందం పొందారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు