Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

14 Jun, 2022 09:55 IST|Sakshi

1.. Russia-Ukraine war:శరణమో, మరణమో
తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్‌క్‌ నగరంలో మారియూపోల్‌ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్‌ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2.. ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 
‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్‌సింగ్‌ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3.. Telangana: ఆకాశంలో అద్భుతం
ఖానాపూర్‌: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్‌ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.. Sri Sathya Sai District: సీకేపల్లికి సీఎం జగన్‌
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయంకు బయలుదేరారు. అన్నదాతలకు అందించే వైఎస్సార్‌ పంటల బీమా కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5.. రాష్ట్రపతి ఎన్నికలు: తెరపైకి శరద్‌ పవార్‌
రాష్ట్రపతి ఎన్నికకు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేతల పేర్లలో ప్రతిపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6.. Lady Oriented Movies: లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో!
లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్‌ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్‌ ఓరియంటెడ్‌’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్‌ ఓరియంటెడ్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7.. BCCI: మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ..
మాజీ క్రికెటర్‌లు, అంపైర్‌లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌ అందించింది. మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరునుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు (పురుషులు అండ్‌ మహిళలు)  అంపైర్‌ల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8..హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల యూనిట్లు నిర్మాణం పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ మార్కెట్‌కు సంబంధించి నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9.. వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్‌ డే: బంగారంలాంటి బ్లడ్‌ డోనర్‌
అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్‌...
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.. కన్నీరు తెప్పించే డెత్‌నోట్‌: అంతేసి ఫీజులు కట్టి.. నరకంలో పడేశారు
ఇవాళ మా అమ్మ పుట్టినరోజు.. అమ్మతో మాట్లాడాలి.. ఒక్కసారి మొబైల్‌ ఇవ్వండి.. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్‌ వార్డెన్‌ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిన ఆ పసి హృదయం ఆత్మహత్యకు తెగించింది. కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్‌ పాఠశాల హాస్టల్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు