1. Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో యూఎస్ నేతలు
అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ నేత మిచ్ మెకొనెల్‌తో పాటు పలువురు రిపబ్లికన్ సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆకస్మిక పర్యటన జరిపారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు కొనసాగిస్తామన్నారు.|
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. వైఎస్సార్ రైతు భరోసాకు సర్వం సిద్ధం
ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. PM Phone Call-Bandi Sanjay: బండి సంజయ్‌కు మోదీ ఫోన్.. ‘హౌ ఆర్యూ బండి..శభాష్’
ప్రజాసంగ్రామ యాత్ర–2, ముగింపు సభ విజయవంతం కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సంజయ్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ పాదయాత్రలో దృష్టికి వచ్చిన సమస్యలు, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన తీరు, తదితర అంశాలపై ఆరా తీశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ఆయన తీరుపై ఒకవైపు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం నెత్తుటి పుండుపై కారం చల్లిన చందంగా తయారైంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. Ashwin Babu: ఆసక్తిగా అశ్విన్ బాబు 'హిడింబ' ఫస్ట్ గ్లింప్స్..
విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. జీనియస్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్‌గా అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. లక్నోకు షాకిచ్చిన రాజస్తాన్.. ప్లే ఆఫ్స్ దిశగా అడుగు
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మొదట రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. హార్ట్ క్రాఫ్ట్.. 'కళ'పోసిన చేతులు
రెండు చేతులు జట్టు కడితే బలం. ఆ చేతులకు భావుకత జత కూడితే అది అందమైన కళారూపం. ప్రకృతి అందాలను సందర్శించినప్పుడు బ్రహ్మ సృష్టి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కళలను కనులారా కాంచినపుడు మానవ సృష్టి గురించి అంతే ఘనంగా చాటుతాం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. Karnataka: యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి.. నువ్వే లేకుంటే నేనెందుకని..
వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించారు. కానీ విధిలీల మరోలా ఉంది. పెళ్లికి సిద్ధమయ్యేలోగా ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ప్రియుడు లేని లోకం తనకు వద్దని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి