-

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

17 May, 2022 10:01 IST|Sakshi

1. తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ
అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కేరళలో టమాటా @ 100
టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రాష్ట్రంలో భారీ విద్యుత్‌ ప్రాజెక్టు
 రాష్ట్రంలో మరో భారీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) విద్యుత్‌ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ.. ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు) కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు
ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మీటర్లు పెడితే నష్టమేంటో చెప్పాలి
 వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టడం వలన వచ్చే నష్టమేమిటో చెప్పకుండా రైతులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హితవు పలికారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్‌
అభిమానులు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను జీవితంలో మరిచిపోలేనని సినీ హీరో మహేష్‌బాబు ఉద్వేగంతో చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు తనకు దొరికారన్నారు. ఒక్కడు సినిమా షూటింగ్‌ సమయంలో కర్నూలు వచ్చానని.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. థామస్‌ కప్‌ విన్నింగ్‌ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమణ
ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ టైటిల్‌ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్‌ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆర్‌బీఐ చర్యలతో ధరల స్పీడ్‌ తగ్గుతుంది
 బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  తీసుకున్న నిర్ణయం దీనితోపాటు మంచి రుతుపవన పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని పరిశ్రమల సంఘం– సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ప్రతికూలతలను తట్టుకునే ‘కుద్రత్‌–3’ 
ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ సింగ్‌ రఘువంశీ రూపుకల్పన చేసిన కుద్రత్‌–3 రకం కంది ప్రతికూల వాతవరణ పరిస్థితులను ధీటుగా తట్టుకొని అధిక దిగుబడులనిస్తూ అనేక రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోందని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో పప్పుధాన్యాల విభాగం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డా. యు.పి. సింగ్‌ తెలిపారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి​

10. Karnataka: వివాహేతర సంబంధం.. ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని..
బెంగళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు (46) ఈ నెల 12న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల  ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే డెత్‌నోట్‌ సోమవారం దొరకడంతో హనీ ట్రాప్‌ అని బయటపడింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


​​​​​​

మరిన్ని వార్తలు