Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

18 Jun, 2022 09:44 IST|Sakshi

1. రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో పుతిన్‌!
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశాల సైన్యం ఎదురు దాడుల కారణంగా భయానక యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఉక్రెయిన్‌కు వివిధ దేశాల నుంచి మద్దతు లభించడంతో రష్యాకు షాక్‌లు తగులుతున్నాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


2. ‘ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు!
అధికారంలో తన వాడుంటే... ఏమీ చేయకపోయినా ప్రశ్నలుండవు. అన్నీ ప్రశంసలే. అదే వేరొకరుంటే మాత్రం... ప్రశంసించాల్సిన చోట కూడా ప్రశ్నలే ఉంటాయి. ఇదీ... రామోజీరావు విధానం. ఇదే ‘ఈనాడు’కు ప్రధానం కూడా.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అగ్నిపథ్‌ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్‌ మూసివేత
 అగ్నిపథ్‌ నిరసనల నేపథ్యంలో విశాఖలోని పలు రైల్వేస్టేషన్‌ల వద్ద భారీగా భద్రత పెంచారు. ఆర్‌పీఎఫ్‌, జీఆర్పీ లోకల్‌ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను సీపీ శ్రీకాంత్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ  రైల్వే స్టేషన్లపై దాడులు పాల్పడవచ్చుననే సమాచారం ఉంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Agnipath Scheme: వారి కళ్లు ఆ భవనంపై పడి ఉంటే.. నెల రోజులు రైళ్లు బంద్‌!
ఆందోళనకారుల చూపు ఆ భవనంపై పడి ఉంటే సికింద్రాబాద్‌ స్టేషన్‌ రైల్వే నిర్వహణ వ్యవస్థ ఓ నెలరోజులు పూర్తిగా కుప్పకూలి ఉండేది. దాన్ని పునరు ద్ధరించే వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగేది. కొద్ది రోజులపాటు కొన్ని రైళ్లను పూర్తిగా నిలిపేయాల్సి వచ్చేది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సికింద్రాబాద్‌ విధ్వంసం: 2021లోనే వాట్సాప్‌ గ్రూప్‌.. ఇప్పుడు ఇలా ప్లాన్‌!
అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా శుక‍్రవారం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దీని వెనుక పెద్ద ప్లాన్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారులను విచారణలో భాగంగా వారి సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అగ్నిపథ్‌ ఎఫెక్ట్‌: బీహార్‌ బంద్‌.. చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు శనివారం(జూన్‌ 18) బీహార్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేతృత్వంలోని సంస్థలు ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఇక, విద్యార్థుల సంఘాల పిలుపు మేరకు బంద్‌కు ప్రతిపక్ష ఆర్జేపీ తన మద్దతు ప్రకటించింది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Project K: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్‌ కె’ టీం క్లారిటీ
‘డార్లింగ్‌’ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న  పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. దీపికా ఆస్వస్థకు గురవడంతో ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయాలని దర్శక-నిర్మాతలను కోరాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి
స్వీట్‌ సిక్స్‌టీన్‌ ఇయర్స్‌ కెరీర్‌... 2006లో భారత్‌ తరఫున ఆడిన తొలి టి20 నుంచి 2022లో ఆడిన ప్రస్తుత మ్యాచ్‌ వరకు తన బ్యాటింగ్‌లో పదును తగ్గలేదని దినేశ్‌ కార్తీక్‌ నిరూపించాడు. ఐపీఎల్‌ ఫామ్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కార్తీక్‌ కొనసాగించగలడా అనే సందేహాలకు మెరుపు బ్యాటింగ్‌తో అతను సమాధానమిచ్చాడు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పెట్రోల్‌ వాహనాలతో సమానంగా ఈవీల రేట్లు
ఏడాది వ్యవధిలోగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్‌ వాహనాల రేట్లతో సమాన స్థాయికి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ స్థానంలో పంటల వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లుగా సహజీవనం.. ఆ క్రమంలోనే..
 ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్‌తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు