Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

19 May, 2022 10:00 IST|Sakshi

1.. పెట్రోల్‌కు పైసల్లేవ్‌.. బంకుల వద్దకు రావద్దు.. మమ్మల్ని క్షమించాలి: శ్రీలంక 
పెట్రోల్‌ కొనేందుకు కావాల్సినంత విదేశీ మారకద్రవ్యం కూడా అందుబాటులో లేదంటూ శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ కారణంగా నెలన్నరకు పైగా తీరంలో ఉన్న నౌక నుంచి పెట్రోల్‌ కొనలేకపోతున్నట్టు ఇంధన మంత్రి కంచన విజెశేకర పార్లమెంటుకు తెలిపారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2..Rajiv Gandhi Assassination Case: పేరరివాళన్‌ పెళ్లి ఏర్పాట్లు షురూ
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌కు సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం లభించిన విముక్తి.. మిగిలిన ఆరుగురినీ ఆశలపల్లకి ఎక్కించింది. సీఎం స్టాలిన్‌ సైతం ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తామని ప్రకటించడం వారి విడుదలపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.  
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3.. Andhra Pradesh: లంచమడిగితే ‘యాప్‌’తో కొట్టండి
అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4..సమయం లేదు గణేశా!.. మరో మూడు నెలలే.. ఏం చేస్తారో ఏంటో?
వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ప్లాన్‌ ఏమిటో అంతుబట్టడం లేదు. బేబిపాండ్లు, ప్లాస్టిక్‌ తటాకాల్లో విగ్రహాలను ముంచి,వెంటనే వెలికి తీస్తేనే అవి సరిపోతాయి.లేకుంటే కష్టం. ఈ అంశంలో జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ ప్లాన్‌ ఏమిటో అంతుపట్టడం లేదు.  
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5.. నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్‌
శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) బుధవారం ప్రకటించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6.. కాస్మొటిక్‌ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్‌ కేర్‌!
‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్‌ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7..Womens World Boxing Championships: పసిడికి పంచ్‌ దూరంలో...
తన కెరీర్‌లో సీనియర్‌ విభాగంలో తొలిసారి ప్రపంచ చాంపియన్‌ కావడానికి భారత యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విజయం దూరంలో నిలిచింది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఈ తెలంగాణ అమ్మాయి 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8..ఈక్విటీల్లో తగ్గుతున్న ఎఫ్‌పీఐల వాటా
భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్‌ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9..పొటాటో పోషణ
బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి. ఈ రసంలో టీస్పూను రోజ్‌ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.. Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్‌
క్రెయిన్‌లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్‌పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే!
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు