Top Morning News: టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

22 Sep, 2022 10:45 IST|Sakshi

1. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు
ఉగ్రవాద కదలికలు, టెర్రర్‌ ఫండింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రల్లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) నేతలు, కార్యాలయాలపై సుమారు 100 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహిచంగా.. గురువారం ఉదయానికి 105 మందిని అరెస్ట్‌ చేసింది.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. పుతిన్‌ ప్రకటనతో రష్యాలో అలజడి!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. దాదాపు అంతటి స్థాయిలో మోహరింపు దిశగా పుతిన్‌ ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే.. ఈ పిలుపుపై రష్యావ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. బిగ్‌ అప్డేట్‌.. పోస్టల్‌ బ్యాలెట్‌ రద్దుకు ఈసీ ప్రతిపాదన!
ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగానికి గురవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దానిని రద్దు చేసే యోచనకు వచ్చింది.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


4.  బీసీలకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా?. బీసీల తోకలు కట్‌ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి
 

5. ఫెడ్‌ ఎఫెక్ట్‌.. రికార్డు కనిష్టానికి రూపాయి
అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి  80.38కి చేరుకుంది.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. కౌర్‌ తుపాన్‌.. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై కొత్త చరిత్ర
ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్‌ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. అంతకు ముందులా లేను.. చందమామ కాజల్‌
‘శారీరకంగా అంతకు ముందులా లేను... ఎనర్జీ లెవల్స్‌ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయినా తగ్గను’ అని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. శరీరం సహకరించకపోయినా అనుకున్నది సాధించే విషయంలో రాజీ పడేదే లేదు అంటున్నారామె. నాలుగు నెలల క్రితం ఆమె ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


8.కోహ్లి, ధావన్‌ల తర్వాత.. స్మృతి మందాన
టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందాన వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్‌గా నిలిచింది.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


9. భారత్‌ ‘శాశ్వత సభ్యత్వ’ హోదాపై బైడెన్‌ ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్‌ సానుకూలంగా ఉన్నారంటూ వైట్‌హౌజ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్‌ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


10. యూటీఎస్‌ యాప్‌ వాడుతున్నారా? అయితే.. మీకో గుడ్‌న్యూస్‌

రైళ్లలో జనరల్‌ కంపార్ట్‌మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్‌ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్‌’ యాప్‌. ఇప్పుడు ఆ యాప్‌ ద్వారా.. అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో టికెట్‌ బుక్‌ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
👉 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు