Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

3 Jun, 2022 09:36 IST|Sakshi

1. AP: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్‌లైన్స్‌ జారీ.. ఇకపై..
ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌​ కార్పొరేషన్‌) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అమిత్‌ షాతో భేటీకానున్న సీఎం జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బిజీబిజీగా గ‌డుపుతున్నారు.  గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయ‌న.. సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Timeline Of Russia-Ukraine War: 100 రోజుల వార్‌.. మరుభూమిగా ఉక్రెయిన్‌.. దశలవారీగా ఏమేం జరిగిందంటే?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి నేటికి 100 రోజులు. ఏడాదికి పైగా సన్నాహాలు జరిపి ఫిబ్రవరి 24న హఠాత్తుగా దాడికి దిగాయి పుతిన్‌ సేనలు. ‘ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణ’ కోసం ‘ప్రత్యేక సైనిక చర్య’ ప్రకటనతో ప్రపంచ దేశాలకు పుతిన్‌ షాకిచ్చారు. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. జ్ఞానవాపి వివాదం: ప్రతీ మసీదులో శివలింగం వెతకడం ఎందుకు?
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్‌-మందిర్‌ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6Photo Feature: ‘కారు’చౌక. ఖర్చు తక్కువ.. రూ.30తో 300 కిలోమీటర్లు!
ఈ ఎలక్ట్రికల్‌ కారు చూస్తే చిన్నగా, పనితీరు మిన్నగా ఉంది. అందులో ప్రయాణం ‘కారు’చౌక. ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ. ఈ కారును ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్‌ రాకేశ్‌ తయారుచేశాడు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్‌ అవసరమవుతుందని, పది యూనిట్లు వినియోగమైనా రూ.30 వరకు ఖర్చు అవుతుందని రాకేశ్‌ వెల్లడించారు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Major Movie Review In Telugu: మేజర్‌ మూవీ రివ్యూ
క్షణం, గుడాచారి,ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అడివి శేష్‌. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ మూవీ సూపర్‌ హిట్టే. తాజాగా ఈ యంగ్‌ హీరో నటించిన చిత్రం ‘మేజర్‌’.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Chris Lynn: ఆ బ్యాటర్‌ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ లిన్‌ టి20 బ్లాస్ట్‌లో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో క్రిస్‌ లిన్‌ నార్తంప్‌టన్‌షైర్‌ తరపున క్రిస్‌ లిన్‌ ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాడు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Restaurants Service Charge: రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్‌ చార్జీ వసూలు చేయుడు బంజేయండి!
రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Tamilnadu Crime: మొదటి భార్యకు ముద్దులు.. ఇది చూసిన రెండో భార్య..
 ఓ భర్త తన మొదట భార్యకు ముద్దు పెట్టడాన్ని జీర్ణించుకోలేని రెండో భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని జోలార్‌పేట సమీపంలో ఉన్న మండలవాడి గ్రామానికి చెందిన రాజ కుమారుడు ప్రభాకరన్‌(28) ఆర్మీలో సిపాయి.
👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు