Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!

8 Jun, 2022 10:00 IST|Sakshi

1. సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్‌ వాహనం పేలి ఇల్లు దగ్దం


 సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్‌పెట్టిన ఓ ఎలక్ట్రిక్‌ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వైఎస్సార్‌ వరమిస్తే.. సీఎం జగన్‌ సాకారం చేశారు


మడకశిర.. జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని జనం. అందుకే యువత ఉపాధి కోసం పెద్దసంఖ్యలో సమీపంలోని కర్ణాటకకు వలసవెళ్తోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. తాజాగా ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు పారిశ్రామికవాడ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. Amarnath Yatra: అమరనాథ్‌ యాత్రపై కన్నేసిన ఉగ్రవాదులు


మూడేళ్ల విరామం తర్వాత మొదలవుతున్న అమరనాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు కన్నేశారు. జూన్‌ 30 నుంచి మొదలై 43 రోజుల పాటు సాగే యాత్రను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా స్టికీ బాంబులతో విరుచుకుపడొచ్చని నిఘా వర్గాలకు ముందే ఉప్పందింది. ఇందుకోసం తరలిస్తున్న ఈ బాంబుల్ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో స్టికీ బాంబుల కథా కమామిషు... 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. Ukraine Russia War: 31,000 రష్యా సైనికుల మృతి


ఉక్రెయిన్‌ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య 31 వేలు దాటినట్టు సమాచారం. తాజాగా వ్లాదిమిర్‌ నిగ్మతులిన్‌ (46) అనే కల్నల్‌ మరణించడంతో యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్‌ సంఖ్య 50కి చేరింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి


 ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోపాటు ఎస్‌ఐ ఐ.వీర్రాజు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. Telangana Politics: 40 మందికిపైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్‌


రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్‌ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్‌ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Nazriya Nazim: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్​


‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్‌ పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బౌలర్లు చెలరేగితే అట్లనే ఉంటది.. ఒకే రోజు 21 వికెట్లు!


కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మ్యాచ్‌ రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు కుప్పకూలాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 213/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఇన్ఫోసిస్‌ ఇదేం బాగాలేదు.. మళ్లీ మళ్లీ అదే పొరపాటా..


ట్యాక్స్‌ రిటర్న్‌లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం  కొత్త పోర్టల్‌లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చి మంగళవారానికి ఏడాది పూర్తయ్యింది. సరిగ్గా అదే సమయానికి మళ్లీ సమస్యలు తలెత్తడం గమనార్హం. పోర్టల్‌లోకి లాగిన్‌ కాలేకపోతున్నామని, సెర్చ్‌ ఆప్షన్‌ సరిగ్గా పని చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌ టెకీ పాడుపని.. ఇన్‌స్టాలో యువతులకు వీడియో కాల్‌ చేసి..


ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళను వేధింపులకు గురి చేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రాచకొండ సైబర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ జే నరేందర్‌ గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన మూడెత్తుల ప్రశాంత్‌ చెంగిచెర్లలో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు