హ్యాట్సాఫ్‌ సార్‌!... హీరోలా రక్షించారు!

22 Nov, 2021 20:36 IST|Sakshi

నెల్లూరు:  చాలా మంది పోలీసులు, రెస్య్కూ సిబ్బంది వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించేందుకు వాళ్లు చూపించే తెగువ, ధైర్య సాహసాలను చూస్తే ఎవరికైన వారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించకుండా ఉండలేరు. పైగా వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపాడతారు. అచ్చం అలానే ఇక్కడొక ట్రాఫిక్‌ పోలీసు వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడాడు.

(చదవండి: జనరల్‌నాలెడ్జ్‌ ఉంటే చాలు... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోగలం!!)

అసలువిషయంలోకెళ్లితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు శివాలయానికి చెందిన పూజారి వెంకటేశ్వరపురం వంతెన పై బైక్‌పై వెళ్తుండగా వరద నీటిలో కొట్టుకుపోయాడు.అదృష్టవశాత్తూ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాయక్ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నాడు. అయితే ఆ పూజారి సహాయం కోసం అతని కేకలు పెట్టడం విన్నాడు. అంతే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నాయక్ వరదనీటిలో ధైర్యంగా వెళ్లి ఆ పూజరిని  తాడు పట్టు​కోమంటూ ధైర్యం చెబుతాడు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ సంబంధించిన వీడియోను ఆంధ్ర పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు "మీ నిస్వార్థ మానవత్వానికి సెల్యూట్... అలాగే కొనసాగించండి సార్" అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌! ఇక సైబర్‌ కేటుగాళ్ల ఆటకట్టు..)

మరిన్ని వార్తలు