Viral Video: ట్రైయిన్‌ కోసం గంటల తరబడి పడిగాపులు..సడెన్‌ ఎంట్రీతో ప్రయాణికుల రియాక్షన్‌

29 Nov, 2022 14:59 IST|Sakshi

వాస్తవానికి మనం ఏదైనా ఊరు లేదా యాత్రకు వెళ్లేటప్పుడూ ట్రైయిన్‌/బస్సు లేదా విమానం కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్‌ చేయాల్సి వస్తుంది. సరిగ్గా ఆ రోజు వాతావరణం బాగోకపోవడమో లేక ఆ వాహనాల్లో సమస్య తలెత్తడం వంటి తదితర కారణాల రీత్యా ఆలస్యమైపోతుంది. దీంతో ఎవరికైనా సహజంగా కోపం, చిరాకు వంటివి వచ్చేస్తాయి. దెబ్బకు మళ్లీ ఎక్కడకి వెళ్లకూడదు అనుకునేంత చిర్రెత్తుకొస్తుంది. అచ్చం అలాంటి ఘటన ఒక రైల్వేస్టేషన్‌లోని ప్రయాణకులకు ఎదురైంది. అ

లాంటి ఇలాంటి లేటు కాదు ఏకంగా 9 గంటలకు పైగా ట్రైయిన్‌ కోసం నిరీక్షించారు. అన్ని గంటలు అంటే కచ్చితంగా బాబోయ్‌ అసలు ట్రైయిన్‌ వస్తుందా రాదా! అన్నంత చిరాకొచ్చి వెళ్లిపోవాలనుకుంటాం. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్‌లో వందలమంది ప్రయాణికులు ట్రైయిన్‌కోసం అలా పడిగాపులు కాచి ఉన్నారే తప్ప అసహనంగా కూడా లేరు. ఎట్టకేలకు తొమ్మిది గంటల ఆలస్యం తర్వాత ట్రైయిన్‌ రానే వచ్చింది. అంతే ప్రయాణకులంతా ఒక్కసారిగా విజిల్స్‌ వేస్తే ఏదో సాధించేసినట్లుగా ఫీలవుతూ హయిగా ఆ రైలు ఎక్కేసారు.

అంతేకాదు దూరం నుంచి చిన్న లైటు వెలుగుతో హారన్‌ వేయిగానే ఎదురుచూస్తున్న ప్రయాణికుల మొహాలు చిచ్చబుడ్డిల్లా వెలిగిపోయాయి. ఐతే ఇంతకీ అదే ఏ స్టేషన్‌ ఎక్కడ జరిగిందనేది తెలయాల్సి ఉంది. అందుకు సబంధించిన వీడియోని హార్దిక బొంతు అనే సోషల్‌ మీడియా వినియోగదారుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇండియాలో ప్రజలు ఏ సమస్యనైనా ఇలానే సహనంతో నవ్వుతూ ఎదుర్కొంటారు, ఇదే ఈ దేశంలోని అసలైన అందం అని కామెంట్లు చేస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!)

మరిన్ని వార్తలు