ఏకంగా రైలునే ఆపేసిన ‘కచోరి’.. ప్రతిరోజూ ఇదే తంతు!

23 Feb, 2022 19:26 IST|Sakshi

ఇష్టమైనవాటి కోసం ఎంతదూరమైనా వెళ్తుంటారు కొందరు! అవి తమ చెంతకే వస్తే!. ఇక్కడో లోకోపైలట్‌ ఏం చేస్తున్నాడో తెలుసా? కచోరిలను చాలా ఇ‍ష్టంగా బ్రేక్‌ ఫాస్ట్‌, స్నాక్స్‌ రూపంతో తింటుంటారు. కానీ, కచోరి కోసం ఆ రైల్వే లోకోపైలట్ రైలునే ఆపేశాడు.ఇలా ఒక్కరోజే కాదు..ప్రతీ రోజూ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్తాన్‌లోని జైపూర్‌ రైల్వే డివిజన్‌ లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ లోకోపైలట్‌.. అల్వార్ సమీపంలోని దౌద్పూర్ క్రాసింగ్ వద్ద ప్రతి రోజు ట్రైన్‌ను ఆపుతుంటాడు.

అదే సమయంలో క్రాసింగ్‌ వద్దకు కచోరిలు అమ్మే వ్యక్తి .. ట్రైన్‌ ఇంజన్‌ బోగీ వద్దకు వచ్చి లోకోపైలట్‌కు కచోరిలు ఇచ్చి వెళ్తుంటాడు. అయితే ప్రతి​రోజూ ఉదయం 8 గంటలకు దౌద్పూర్‌ క్రాసింగ్‌ వద్ద ఇలా జరగడంతో.. రైలు ప్రయాణికులు, క్రాసింగ్‌ దాటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆ రైలులోని ఇద్దరు లోకోపైలట్లు, ఇద్దరు గేట్‌మన్లు, ఇన్‌స్ట్రక్టర్‌ను జైపూర్‌ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ నరేంద్ర కుమార్‌ సస్పెండ్‌ చేశారు.

ఈ ఘటనపై అల్వార్ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌ఎల్‌ మీనా మాట్లాడుతూ.. లోకోపైలట్‌ చేస్తున్నపనిని తీవ్రంగా ఖండించారు. లోకో పైలట్లు రైలను తమ వ్యక్తిగతమైన అవసరాల కోసం ఎక్కడా నిలపకూడని అన్నారు. కచోరి కోసం కదులుతున్న రైలును ఆపడం సరైన పని కాదని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తలు