వెనక్కి ప్రయాణించిన రైలు.. తప్పిన భారీ ముప్పు

18 Mar, 2021 08:36 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఘటన 

డెహ్రాడూన్‌: ఓ రైలు కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి ప్రయాణం చేసింది. అదృష్టం కొద్ది ఆ సమయంలో పట్టాలపై ఎవరు లేకపోవడం.. వేరే రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఢిల్లీ నుంచి తనక్‌పూర్‌ వెళ్తోన్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం రివర్స్‌లో ప్రయాణం చేసింది. అలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాక్‌ మీద వేరే రైళ్లు రాకపోవడం.. జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. 

జంతువును తప్పించడం కోసం సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ఇలా జరిగిందని తెలిపారు అధికారులు. ఈ సందర్భంగా చంపావత్‌ ఎస్పీ లోకేశ్వర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘సడెన్‌గా పట్టాలపైకి ఓ జంతువు వచ్చింది. దాన్ని కాపడటం కోసం సడెన్‌ బ్రేక్‌ వేశారు. దాంతో రైలు దానికదే వెనక్కి ప్రయాణించడం ప్రారంభించింది. బన్‌బాసా నుంచి చనక్‌పూర్‌ వరకు వెళ్లిన రైలు ఆ తర్వాత ఆగిపోయింది. ఈ సమయంలో రైలులో 60-70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరిని చనక్‌పూర్‌ నుంచి బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు పంపించాము’’ అని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి లోకో పైలెట్‌, గార్డ్‌ని సస్పెండ్‌ చేసినట్లు నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

చదవండి:

బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్‌

ఒక్క క్షణం ఆలస్యమైతే.. పరిస్థితి? వైరల్‌ వీడియో 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు