వాట్సాప్‌తో ఫుడ్‌ ఆర్డర్‌ చేయొచ్చు

7 Feb, 2023 05:58 IST|Sakshi

త్వరలో రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ సౌకర్యం

న్యూఢిల్లీ: వాట్సాప్‌ నంబర్‌తో కావాల్సిన ఆహారపదార్థాలను ఆర్డర్‌ చేసే సౌకర్యం రైలు ప్రయాణీకులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బోట్‌ ప్రయాణికులకు మీల్స్‌ను బుక్‌ చేస్తుంది.

ఈ కేటరింగ్‌ సేవల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్‌ www.catering.irctc.co.in తోపాటు ఈ–కేటరింగ్‌ యాప్‌ ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపింది. ఇ–టికెట్‌ బుక్‌ చేసుకుని, ఇ–కేటరింగ్‌ సేవలకు ఆప్షన్‌ ఇచ్చిన ప్రయాణికులకు వాట్సాప్‌ నంబర్‌ నుంచి మెసేజీ వెళ్తుంది. దాని ద్వారా ఆ మార్గంలోని స్టేషన్లలో నచ్చిన రెస్టారెంట్లలో మీల్స్‌ బుక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు