మోదీపై తృణమూల్‌ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు, జైశంకర్‌పై కూడా..

22 Feb, 2023 15:20 IST|Sakshi

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ బ్యూరోక్రాట్‌ జవహార్‌ సిర్కార్‌ ఓ మీడియా ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. పైగా జై శంకర్‌ తండ్రి కే సుమ్రమణ్యం ప్రధాని నరేంద్ర మోదీని అసుర అని సంబోధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు జవహార్‌ సిర్కార్‌ ట్విట్టర్‌ వేదికగా జైశంకర్‌ తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు జైశంకర్‌ తండ్రి సుబ్రమణ్యం గుజరాత్‌ 2002 అల్లర్లల విషయంలో ధర్మ హత్య జరిగిందన్నారు. అమాయకులను రక్షించడంలో మోదీ విఫలమై అధర్మానికి పాల్పడ్డారన్నారన్నారు. కానీ ఆయన కొడుకు ఒక అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడకుండా సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెబుతున్నాడంటూ జైశంకర్‌పై సిర్కార్‌ మండిపడ్డారు.

అంతేగాదు నాడు జై శంకర్‌ తండ్రి రాముడు కచ్చితంగా గుజరాత్‌లోని అసుర పాలకులపై బాణాలను ఎక్కుపెట్టేవాడంటూ తిట్టిపోసిన వ్యాఖ్యలను చెప్పుకొచ్చారు  సిర్కార్‌. ఇదిలా ఉండగా, జైశంకర్‌ విదేశాంగ కార్యదర్శి నుంచి రాజకీయ ప్రస్తానం వరకు సాగిన ప్రయాణం గురించి ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1980లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ సెక్రటరీగా ఉన్న తన తండ్రి కె సుబ్రమణ్యంను తొలగించారన్నారు. పైగా తన తండ్రి కంటే జూనియర్‌గా ఉన్న వ్యక్తిని ఆ పదవిలోకి భర్తీ చేశారని చెప్పారు.

అలాగే తాను బీజేపీలోకి ఎందుకు చేరానో కూడా వివరించారు. దీంతో తృణమాల్‌ కాంగ్రెస్‌ ఎంపీ జవహార్‌ విదేశాంగ మంత్రి మతిమరుపుతో బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నాడు తండ్రి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి...గాంధీలపై ఉన్న అక్కసులను మరోసారి జైశంకర్‌ బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ఆయన బీజేపీకి విధేయతగా పనిచేసి అత్యున్నత పదవులను పొందారు. విదేశాంగ మంత్రి పదవిని ఇచ్చినందుకు బీజేపీ తలెకెత్తించుకుంటూ పొగడ్తున్నాడా లేక పదవి మత్తులో మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారా! అంటూ ట్విట్టర్‌లో జైశంకర్‌కి గట్టి చురలకలంటించారు. 

(చదవండి:

మరిన్ని వార్తలు