వంటగ్యాస్‌ మండిపోతుంది...ఇక పచ్చి కూరగాయాలే తిందాం!

1 Aug, 2022 17:54 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ధరల పెరుగుదల పై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై తృణమూల్‌ ఎంపీ కకోలి ఘోష్‌ దస్తీదార్‌ పార్లమెంట్‌లో లేచి నిలబడి మాట్లాడుతూ... చర్చకు అనుమతిచ్చినందుకు ధన్యావాదాలని చెబుతూ... పెద్ద ఎత్తున ధరల పెరుగుదల  గురించి విమర్శలు చేశారు. ఇక తాము పచ్చి కూరగాయాలే తినాలని కోరుకుంటుందా ప్రభుత్వం అంటూ నిలదీశారు.

వంటగ్యాస్‌ ధర గత కొన్ని నెలల్లోనే నాలుగు సార్లు పెరిగిందని ఇక ఏం వండుకుని ప్రజలు తింటారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగ్యాస్‌ ధర ఇలాపెరుగుతూ ఉంటే పచ్చి కూరగాయాలే తినాలంటూ... పార్లమెంట్‌లోనే అందరి ముందు పచ్చి వంకాయ తిని చూపిస్తూ... ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు. అంతేకాదు ఈ వంటగ్యాస్‌ ధర రూ. 600 నుంచి రూ. 1100కి ఎలా పెరిగిందో వివరించి చెప్పడమే కాకుండా సిలిండర్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌​ చేశారు.

పైగా ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్దిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేయడంతో సామాన్య కుటుంబాలు వంట గ్యాస్‌ కొనుగోలుకు సబ్సిడీ లేని రేట్లు చెల్లిస్తున్నారని కూడా ఈ సందర్భంగా కకోలి ఘోష్‌ చెప్పుకొచ్చారు. ఐతే కాంగ్రెస్‌ ఎంపీలు సస్పెండ్‌ అవ్వడంతో ఈ చర్చలు రెండుసార్లు వాయిదాపడ్డా తదనంతరం లోక్‌సభలో ఈ ధరల పెరుగుదల గురించి చర్చలు ఘాటుగా జరిగాయి.

(చదవండి: పాత్రా చావల్‌ స్కామ్‌: వీడిన సస్పెన్స్‌.. ఈడీ కస్టడీకి సంజయ్‌ రౌత్‌.. ముంబై PMLA కోర్టు ఆదేశం)

మరిన్ని వార్తలు