కరోనా వైరస్: వామ్మో! ‌ డబుల్ కాదు.. ట్రిపుల్‌‌..!‌

21 Apr, 2021 17:46 IST|Sakshi

ఢిల్లీ: భారత్‌లో రోజు నమోదవుతున్న కరోనా కేసులను చూసి పరిశోధకులు ఒక్కింతా విస్మయానికి గురవుతున్నారు. దేశంలో సుమారు రోజు మూడు లక్షల పైగా కరోనా కేసులు, 2వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు భారత్‌లో కరోనా డబుల్‌ మ్యూటేషన్‌ ఉన్నట్లుగా తొలుత భావించగా, ప్రస్తుతం భారత్‌లో కరోనా ట్రిపుల్‌ మ్యూటేషన్‌ కూడా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రిపుల్‌ మ్యూటేషన్‌ వలనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.

ట్రిపుల్‌ మ్యూటేషన్‌లో మూడు కోవిడ్‌ స్ట్రెయిన్లు కలిపి కొత్త వేరియంట్‌గా మారాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో నమోదైన కేసుల్లో ట్రిపుల్‌ మ్యూటేంట్‌ కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూనే ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. ‘ట్రిపుల్‌ మ్యూటేంట్‌తో వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో పాటు వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోంద’ని మెక్‌ గిల్‌ యూనివర్సిటీ ఎపిడమియాలజీ ప్రొఫెసర్‌ మధుకర్‌ తెలిపారు. ఈ మ్యూటేషన్లకు సరిపోయే వ్యాక్సిన్లు మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో (జీనోమ్‌ సీక్వెన్స్‌) జన్యు శ్రేణిలను కేవలం ఒక శాతం కంటే తక్కువగా స్టడీ చేస్తున్నామన్నారు. ఇది భారత్‌కు పెను సవాల్‌గా మారనుందని తెలిపారు.

ట్రిపుల్‌ మ్యుటేషన్‌ ఎంత వరకు ప్రభావం చూపనుంది..!
డబుల్‌ మ్యూటేషన్‌తో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో పది మందిల్లో ఒకరు లేదా ఇద్దరికి వైరస్‌ వ్యాప్తి చెందగా, ప్రస్తుత డబుల్‌ మ్యూటేషన్‌తో వైరస్‌ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. డబుల్‌ మ్యూటేషన్‌తో చివరికి చిన్న పిల్లలు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. ట్రిపుల్‌ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ మ్యూటేషన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్లు మాత్రమే ఉన్నాయి.

చదవండి: కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్‌

మరిన్ని వార్తలు