ట్రిపుల్‌ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు

24 Apr, 2022 07:09 IST|Sakshi
ముగ్గురు శిశువులు 

మైసూరు: ఒకే కాన్పులో ఒకరూ ఇద్దరు కాదు ఏ­కంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ గ­ర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు 7 నెలలు. ప్రస­వ వేదన రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేశా­రు.

ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల పు­ట్టా­రు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణురాలు డాక్టర్‌ లీలావతి తెలిపారు.  కాగా, శిశువులు కొంత బరువు పెరిగేవరకూ 20 రోజులు ఐసీయూలో ఉంచుతామన్నారు. తల్లి లక్ష్మి మా­ట్లాడుతూ స్కానింగ్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళన చెందానని, పిల్లలు క్షే­మంగా ఉండడంతో సంతోషంగా ఉందని చెప్పా­రు.

చదవండి: (Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం)

మరిన్ని వార్తలు