ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ భవన్‌ నిర్మాణం ప్రారంభం  

21 May, 2022 01:37 IST|Sakshi
ఢిల్లీలో నిర్మించనున్న టీఆర్‌ఎస్‌ భవన్‌ నమూనా  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో పాటు ఎండీపీ ఇన్‌ఫ్రా నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇప్పటికే తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు