జమ్ము ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు

27 Jun, 2021 10:10 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్‌ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్‌ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది.

కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్‌ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. 

కాగా, టెక్నికల్‌ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్‌ టీంలు క్లూస్‌ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు.

చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు