‘అద్భుతం.. ఇంతవరకు చూడలేదు’

12 Aug, 2020 17:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అద్బుతమైన దృశ్యం.. ఇటువంటి అరుదైన ప్రతిభ ముందెన్నడు చూసి ఉండరు. సాధారణంగా చేతితో వేసే పెయింటిగ్స్‌, స్కెచ్ బొమ్మలు, శాండ్‌ ఆర్ట్‌లను, రోడ్డపై కలర్స్‌తో వేసే బొమ్మలను చూస్తూనే ఉంటాం. కానీ ఎండలో నీటీతో వేసిన ఆర్ట్‌లను చూశారా.. అయితే అది అసాధ్యమే అయినప్పటికీ ఈ అరుదైన అద్భుతాన్ని ఇద్దరూ యువకులు సుసాధ్యం చేసి చూపించారు. రోడ్డుపై నీటీతో వేసిన‌.. బాస్కెట్‌ బాల్‌ కోర్టులో వ్యక్తి ఆడుతున్నట్లుగా చూపించిన వినూత్నమైన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఇది చూసిన నెటిజన్‌లు సదరు యువకులపై ప్రశంసల జల్లు  కురిపిస్తున్నారు.  22 సెకన్ల నిడివి గల ఈ వీడియోను మాజీ బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రెక్స్‌ చాంప్‌మాన్‌ షేర్‌ చేశాడు.

దీనికి ‘ఇంతవరకు నేను ఇలాంటి వీడియోను చూడలేదు. నిజంగా ఇది అసాధారణమైన అద్భుతం. బాస్కెట్‌ బాల్‌ రాక్స్‌’ అంటూ రాక్స్‌ ట్వీట్‌ చేశాడు. ఈ అరుదైన ఈ వీడియోకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘ఇది చాలా అద్బుతంగా ఉంది’, ‘‘నిజంగా ఇలాంటి వీడియో ఇంతకు ముందెన్నడు చూడలేదు... మనుషుల్లో కూడా నమ్మలేని రితీలో ప్రతిభ ఉంటుందని ఇది చూస్తే అర్థం అవుతోంది’’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ట్వీట్‌లో ఒక యువకుడు రోడ్డుపై పుడుకుని ఉండగా మరో వ్యక్తి అతడి చూట్టూ వాటర్‌ స్ప్రేతో లేఅవుట్‌ గీశాడు. అలా నీటీ తేమతో బాస్కెట్‌ బాల్‌ కోర్టులో వ్యక్తి బాస్కెట్‌ బాల్‌ ఆడుతూ.. బాల్‌ను గోల్‌ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇది చేయడానికి ఆ యువకులు 5 రోజుల సమయం పట్టిందని, దీని 95 డిగ్రీ వాతావరణంలో చేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా