డ్యూటీలో ఉండగా వైరల్‌ వీడియోలు.. ఆపై..

9 Jun, 2021 14:45 IST|Sakshi

న్యూఢిల్లీ: డ్యూటీలో ఉండగా సోషల్ మీడియా కోసం వీడియోలను చేసిన ఢిల్లీ చెందిన ఇద్దరు పోలీస్‌ సిబ్బందికి షో కాజ్ నోటీసు జారీ చేశారు. నార్త్‌వెస్ట్ డీసీపీ ఉషా రంగ్నాని జారీ చేసిన నోటీసుల ప్రకారం.. మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో తీసిన వీడియోలో మహిళా హెడ్ కానిస్టేబుల్ శశి, కానిస్టేబుల్ వివేక్ మాథుర్ ఉన్నారని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో తమ విధులను నిర్వర్తించేటప్పుడు ఈ వైరల్‌ వీడియోలను చేసినట్టు పేర్కొన్నారు.

యూనిఫాంలో ఉండగా చేసిన ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అవి వైరల్‌గా మారాయని తెలిపారు. అయితే వీరిద్దరూ కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. విధుల్లో ఉండి ఇలా చేయడాన్ని సహించంమని అన్నారు. నోటీసులు అందిన 15 రోజుల్లో దీనిపై సరియైన వివరణ ఇవ్వాలని.. లేకుంటే వారిపై క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
 

(చదవండి: ముగిసిన కేం‍ద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు)

మరిన్ని వార్తలు