Viral Video: ఏనుగుల పోరాటం

12 Jun, 2021 13:38 IST|Sakshi

కర్నాటక: రెండు ఏనుగులు తలపడ్డాయి. తొండంతో ఒకదానిపైకి మరొకటి కలబడ్డాయి. నువ్వా నేనా  అన్నట్టుగా పోరాటం చేశాయి. రెండు ఏనుగులు పోటాపోటీగా ఘీంకరిస్తూ గొడవకి దిగితే అక్కడున్న ఫారెస్ట్‌ సిబ్బంది ఆందోళనతో అటు ఇటు పరుగులు పెట్టారు. ఇంతకీ ఈ ఏనుగుల యుద్ధం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది. 


సత్యమంగళం అడవులతో పాటు పశ్చిమ కనుమలకు నెలవైన కర్నాటకలో ఏనుగులు సంఖ్య ఎక్కువ.అప్పుడప్పుడు అడవుల్లోంచి ఏనుగులు గ్రామాలపైకి దండెత్తుతాయి. వాటిని తిరిగి అడవుల్లోకి పంపే పనిని శిక్షణ పొందిన ఏనుగులు తీసుకుంటాయి. ఈ క్రమంలో రెండు ఏనుగులు తలపడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రెండు ఏనుగులు కొట్టుకోవడం వల్ల బలహీనంగా ఏనుగు గాయాలపాలవుతుందని... పోరాడే పద్దతికి బదులు మరో ప్రత్యామ్నాయం చూడలంటున్నారు జంతు ప్రేమికులు.

చదవండి : Cheetahs: చీతా.. పునరాగమనం

మరిన్ని వార్తలు