క్వారంటైన్‌ ముగిసింది.. 24 గంటల్లోనే మట్టుపెట్టాయ్‌

8 Nov, 2022 07:15 IST|Sakshi

షియోపూర్‌: నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తీసుకువచ్చిన చీతాలు వేట మొదలుపెట్టాయి. క్వారంటైన్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసిన ఫ్రెడ్డీ, ఆల్టన్‌ అనే రెండు మగ చీతాలు 24 గంటల్లోనే మచ్చల జింకను విజయవంతంగా వేటాడాయి.

ఆదివారం రాత్రి లేదా సోమవారం వేకువ జామున వేటాడి ఉంటాయని అధికారులు చెప్పారు. అనంతరం రెండు గంటల్లోనే ఆహారాన్ని తినేశాయని చెప్పారు. వేటలోనూ ఇవి సత్తా చాటాయని చీఫ్‌ ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ ఉత్తమ్‌ కుమార్‌ శర్మ సోమవారం చెప్పారు.

సెప్టెంబర్‌ 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకు వచ్చిన 8 చీతాల మొట్టమొదటి వేట ఇదేనన్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్‌లను వదిలిన ఎన్‌క్లోజర్‌ విస్తీర్ణం 98 హెక్టార్ల వరకు ఉంటుందని చెప్పారు. మిగతా వాటిని కూడా దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: ఎంతో ఉల్లాసంగా ఉన్నాయ్‌- ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు