పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!

21 Nov, 2021 18:03 IST|Sakshi

భువనేశ్వర్‌: పామువిషం విక్రయం గుట్టురట్టయింది. ఈ మేరకు ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారి నుంచి 1 కిలోగ్రాము పాము విషం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా.

ప్రస్తుతం జప్తు చేసిన పాము విషం పరీక్షల కోసం ప్రయోగశాలకు తరలించారు. పట్టుబడిన నిందితుల్లో సంబల్‌పూర్‌ జిల్లా, సిందూర్‌పంక్‌ గ్రామస్తుడు కైలాస్‌ సాహు, సఖిపొడా గ్రామస్తుడు రంజన్‌కుమార్‌ పాఢి ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నంచి సేకరించిన పాము విషాన్ని దేవ్‌గఢ్‌ ప్రాంతంలో విక్రయించేందుకు మంతనాలు జరుగుతుండగా, పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. 

చదవండి: (24న కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఆ బిల్లుల ఉపసంహరణ..) 

మరిన్ని వార్తలు