గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు నక్సల్‌ మృతి

28 Apr, 2021 20:00 IST|Sakshi

చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తహశీల్ పరిధిలోని జాంబియా గాటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌజాగట్టా అటవీ ప్రాంతంలో బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. మృతులు వినయ్ లాలూ, వినయ్ నరోట్‌గా గుర్తించారు. వీరిపై రూ.4 లక్షల రూపాయలు రివార్డ్ ఉందని ఎస్పీ తెలిపారు. మృతుల నుంచి 4 ఎంఎం ఫిస్టల్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

మావోయిస్టుల వ్యతిరేక నిర్మూలన కార్యక్రమంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారని ఎస్పీ అంకిత్‌ గోయల్‌ తెలిపారు. వెంటనే పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఇటీవల పామ్కెగహ పోలీసు శిబిరంపై కాల్పులు జరిపారని, మృతిచెందిన నక్సల్స్‌పై అనేక కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి హెలికాప్టర్‌లో మృతదేహాలను జిల్లా కేంద్రం గడ్చిరోలికి తరలించారు.

కాల్పుల్లో మరణించిన మావోయిస్టులు

మరిన్ని వార్తలు