ప్లాస్మాను వదలని అక్రమ రాయుళ్లు

13 May, 2021 08:18 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌ అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

నోయిడా: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాధార ఔషధాలు, అక్సిజన్‌ మాత్రమే కాదు. రక్తంలోని ప్లాస్మాను కూడా అక్రమంగా అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో కోవిడ్‌-19 బాధితులకు ష్లాస్మాను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారు ఒక్కో యూనిట్‌ రూ.50,000 నుంచి రూ.60,000 చొప్పున బ్లడ్‌ ప్లాస్మా అమ్ముతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్లాస్మా కావాల్సిన వారు సంప్రదించాలని సూచిస్తూ నిందితులు ఫేస్‌బుక్‌ ఖాతాలో ఫోన్‌ నంబర్‌ సైతం ఇవ్వడం గమనార్హం.

నిందితుడు అనిల్‌ శర్మ తన తల్లికి అవసరమైన ప్లాస్మా కోసం ఓ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేసే రోహిత్‌ రాఠీని గతంలో సంప్రదించాడు. అనంతరం ఇద్దరూ జట్టుకట్టారు. దాతలకు కొన్ని డబ్బులిచ్చి ప్లాస్మా సేకరించి, కరోనా బాధితులకు అధిక ధరలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటు న్నారని గ్రేటర్‌ నోయిడా అదనపు డీసీపీ విశాల్‌ పాండే తెలిపారు. నిందితుల నుంచి ఒక యూనిట్‌ ప్లాస్మాతో పాటు రూ.35,000 నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సెక్షన్‌ 42 (మోసం) కింద, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌. యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాష్త చేస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి:

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య?

మరిన్ని వార్తలు