మరణించినా ప్రాణం పోశారు! 

21 Aug, 2021 06:33 IST|Sakshi

 ఇద్దరి అవయవ దానం 14 మందికి పునర్జన్మ 

మైసూరు: మృత్యుఒడికి చేరుతూ ఆ ఇద్దరు మరికొందరికి జీవం పోశారు. కుశాల్‌నగరకు చెందిన శోభా, హుణసూరికి చెందిన లారెన్స్‌ మృత్యువుతో పోరాడుతూ 14 మందికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలు... కుశాల్‌ నగర్‌కు చెందిన శోభాకు మెదడులో రక్తస్రావం జరగడంతో మెదడు స్తంభించిపోయింది. వివిధ రకాల చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు.

అదే విధంగా లారెన్స్‌ ఈనెల 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఇద్దరి మూత్రపిండాలు, లివర్, హృదయ కవటాలు, కార్నియా దానం చేశారు. మృతుల బంధువుల ఔదార్యాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. 

మరిన్ని వార్తలు