ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య.. 144 సెక్షన్‌ విధింపు

19 Dec, 2021 13:47 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ)నేత కేఎస్‌ షాన్‌ను గుర్తుతెలియని దుండగులు  ఆదివారం ఉదయం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఎ.అలెగ్జాండర్‌ అలప్పుజ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు. బీజేపీ నేత శ్రీనివాసన్‌(40)ను తన ఇంటిలోనే గుర్తుతెలియని దుండగులు దాడిచేసి చంపారు. ఆయన 2016 ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.  సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్‌ షాన్‌ను కూడా గుర్తుతెలియని ముఠా చేతిలో హత్య గురయ్యారు. ఈ ఘటనపై ఎస్‌డీపీఐ స్పందిస్తూ.. తమ నాయకుడి  హత్య వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ ప్రమేయం ఉందని ఆరోపించింది.

చదవండి:  కోతి వర్సెస్‌​ కుక్క! సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!

ఇద్దరు రాజకీయ నేతల హత్యలపై కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ స్పందిస్తూ.. హత్యలపై వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమాజంలో గందరగోళం సృష్టించే ఈ చర్యలను ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీనివాసన్‌ మృతిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతను ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టుల గ్రూప్‌ హత్య చేసిందని ఆరోపించారు. శ్రీనివాసన్‌ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని తెలిపారు. రెండు పార్టీల సంబంధించిన నేతలు హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు