శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మోస్ట్‌ వాంటెట్‌ టెర్రరిస్ట్‌లు హతం

23 Aug, 2021 21:09 IST|Sakshi

న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని అలుచి బాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లస్కరే తోయిబా ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాలో కమాండర్‌ స్థాయిలో విధులు నిర్వహించే అబ్బాస్‌ షేక్‌, షకీబ్‌ మన్సూర్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ల జాబితాలో చనిపోయిన ఈ ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం. 

కశ్మీర్ జోన్ పోలీసుల సమాచారం ప్రకారం.. అలుచి బాగ్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
చదవండి:  పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు