బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల ఫైట్.. తగ్గేదేలే!

13 Aug, 2021 21:20 IST|Sakshi

ప్రేమ.. రెండక్షరాల ఈ పదం ఎంతో మంది జీవితాలను ముడిపెడుతుంది. అదే సమయంలో ఎంతోమంది జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రేమించిన వారు దక్కితే ఆనందం.. మనల్ని కాదని వెళ్లిపోతే కొండంత దుఃఖం.. వీరిలో కొంతమంది మాత్రమే మనసిచ్చిన వారిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించి పోరాడుతారు. అలకలు, గొడవలు, దెబ్బలు ఇలా ఎన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అది ప్రేమకున్న గొప్పతనం. ఇలా ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

ఇప్పుడిదంతా ఎందుకుంటే ప్రేమకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది. ఇష్టపడిన ఒకరి కోసం ఓ ఇద్దరు బీభత్సం సృష్టించారు. సాధారణంగా అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవలు పడడం ఇప్పటి వరకు చూసే ఉన్నాం. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఒక యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డెక్కారు. నడిరోడ్డు మీద జుట్టూ.. జుట్టూ పట్టుకొని కొట్టుకున్నారు. సిగపట్లుతో కుస్తీ పట్టారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని సరాయకేలాలో చోటుచేసుకోగా కొందరు స్థానికులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో తిరగడాన్ని అమ్మాయి సహించలేకపోయింది. వారు ఎదురుగా కనిపించడంతో కోపం ఎక్కువై.. తోక తొక్కిన తాచుపాములా విరుచుకుపడింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువతి జుట్టు పట్టుకొని, పిడిగుద్దులతో దాడి చేసింది. అయితే నాలుగు దెబ్బలు పడగానే అవతలి అమ్మాయి కూడా ఏ మాత్రం తగ్గలేదు. యువతిపై ఎదురు దాడికి దిగింది. ఇద్దరు అమ్మాయిలు కిందపడి పొర్లుతూ కొట్టుకున్నారు. ఇది చూసిన వారికి ఓ సినిమా చూసిన పనైంది. చివరికి ఈ విషయం పోలీసులకు చేరడంతో యువతులతో పాటు యువకుడు సైతం అక్కడ్నుంచి జంప్‌ అయ్యారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు