రూ.50కి ఆశపడి.. లక్ష పోగొట్టుకున్నాడు 

8 May, 2022 15:38 IST|Sakshi

సాక్షి, చెన్నై: చెన్నై, ఆవడి సమీపంలోని అంబికాపురానికి చెందిన త్యాగరాజన్‌ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌. ఇతను తాకట్టు పెట్టిన నగలను విడిపించడానికి రూ.లక్షతో ఇంటి నుంచి శుక్రవారం మధ్యాహ్నం తిరునిండ్రవూర్‌లో ఉన్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు బయలుదేరాడు. అతను తిరువళ్లూరు – చెన్నై జాతీయ రహదారిపై అతన్ని వెంబడించిన నలుగురు వ్యక్తులు త్యాగరాజన్‌తో ‘‘మీ జేబులో ఉన్న రూ. 50 నోటు కింద పడింది..’’ అని తెలిపారు.

దీంతో అతను బైకును రోడ్డు పక్కన నిలిపి యాభై రూపాయలు తీసుకుని తిరిగి రాగా ఇంతలో బైక్‌లో ఉంచిన రూ.లక్ష  కనిపించలేదు. దీంతో తిరునిండ్రవూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో నలుగురు వ్యక్తులు బాధితుడి దృష్టిని మళ్లించి రూ.లక్ష నగదు చోరీ చేసి పారిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుల కోసం గాలిస్తున్నారు.  

చదవండి: (తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్‌ అపూర్వతో యతీష్‌ వివాహం)

మరిన్ని వార్తలు