ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం పెట్టడం కాదు.... గుండెల్లో ఉండాలి!

13 Aug, 2022 21:26 IST|Sakshi

ముంబై: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చేపట్టిన 'హర్‌ ఘర్‌ తిరంగ' కార్యక్రమంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే మాట్లాడుతూ...కేవలం త్రివర్ణ పతాకన్ని పెడితే దేశభక్తుల కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది అజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చేస్తున్నారు నిజమే కానీ 75 ఏళ్ల స్వాతంత్య్ర అనంతరం ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

తన తండ్రి బాల్‌ థాకరే 1960లో ప్రారంభించిన కార్టూన్‌ మ్యాగజీన్‌ మార్మిక్‌ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఓ వీడియోలో మాట్లాడుతూ...భారత్‌ బానిసత్వం వైపు వెళ్లడానికి వ్యతిరేకంగా కార్టూనిస్టులు ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు. అయినా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయమంది, కానీ ఎవరో పంపించిన ఒక వైరల్‌ చిత్రంలో తన వద్ద త్రివర్ణ పతాకం ఉంది గానీ ఇల్లు లేదని ఒక పేదవాడు చెబుతున్నాడని అన్నారు.

నేటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనీయులు ప్రవేశిస్తున్నారు. మన ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఉంచితే వాళ్లు వెళ్లిపోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జాతీయత అనేది మన హృదయాల్లో ఉండాలని గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే సాయుధ బలగాల బడ్జెట్‌లో కోత పెట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. త్రివర్ణ పతాకాన్ని డీపీ పెట్టడం సంతోషమే, కానీ ఇళ్లను వదిలి దేశం కోసం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల బడ్జెట్‌లో కోత పెట్టడం దురదృష్టమని అన్నారు. అగ్నిపథ్‌ పథకం పై కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కి కోంస మీ వద్ద డబ్బు లేదు కానీ రాష్ట్రల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మీ వద్ద డబ్బు ఉందంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. అలాగే బిహార్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క రాష్ట్రంలోని ప్రభుత్వాలను పడగొట్టడమే ధ్యేయంగా బీజేపీ కంకణం కట్టుకుందంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు ఆదిత్యనాథ్‌ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని బీజేపీని ప్రశ్నించారు కూడా.

(చదవండి: థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. ఫుల్‌ జోష్‌లో బీజేపీ)

మరిన్ని వార్తలు