‘భారత్‌ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు

3 Mar, 2021 19:40 IST|Sakshi

ముంబై: అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే తీవ్రమైన విమర్శలు చేశారు. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగంపై చర్చకు సమాధానం ఇస్తూ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ మోటేరా స్టేడియానికి ఉన్న సర్దార్‌ పటేల్‌ పేరును చేరిపేసిందని మండిపడ్డారు. అదీ కాకుండా వీర్‌ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా తమకు హిందుత్వం నేర్పడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

తాము ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టామన్నారు. కానీ, బీజేపీ వాళ్లు ఏకంగా సర్దార్ పటేల్ స్టేడియం పేరును మార్చారని మండిపడ్డారు. ‘భారత్‌ మాతాకి జై’ అని నినాదాలు చేసినంత మాత్రనా మిమ్మల్ని మీరు(బీజేపీ) దేశభక్తులు అనుకోడం సరికాదన్నారు. ‘భారత్‌ మాతాకి జై’ అని నినాదించే హక్కు బీజేపీకి లేదని ఉద్దవ్‌ విమర్శించారు.

చదవండి: పూజా చవాన్‌ ఆత్మహత్య.. మంత్రి రాజీనామా

మరిన్ని వార్తలు