ఆ ఆన్‌లైన్‌ పీహెచ్‌డీలు చెల్లవు.. స్టూడెంట్స్‌కు యూజీసీ హెచ్చరిక

29 Oct, 2022 17:10 IST|Sakshi

ఢిల్లీ: పీహెచ్‌డీ కోర్సుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సంయుక్తంగా శుక్రవారం ఒక జాయింట్‌ అడ్వైజరీ రిలీజ్‌ చేశాయి. విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ(ఎడ్‌టెక్‌) కంపెనీలు నిర్వహిస్తున్న పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ చెల్లవని ప్రకటించింది.

ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ కోర్సులకు ఎలాంటి గుర్తింపు ఉండబోదని పేర్కొంటూ.. ఈ మేరకు ఓ పబ్లిక్‌ నోటీసును జారీ చేసింది కంట్రోలర్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌. తమ మార్గదర్శకాల ప్రకారం.. ఎడ్‌టెక్‌ కంపెనీలు నిర్వహించే ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు గుర్తింపు ఉండబోదని స్పష్టం చేసింది. యూజీసీ రెగ్యులేషన్‌ 2016 ప్రకారం ప్రామాణికాలు పాటించాల్సిందేనని, అన్ని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ కూడా యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. 

విదేశీ యూనివర్సిటీల సహకారంతో.. ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ అంటూ వచ్చే ప్రకటనలపట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటికి ఆకర్షితులు కావొద్దంటూ విద్యార్థులకు సూచించింది ఆ నోట్‌. పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్‌లు తీసుకునేముందు యూజీసీ రెగ్యులేషన్‌ 2016లోబడి ఉందో క లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది. ఈ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్న పలు ఉదంతాలు ఇటీవల తెరపైకి రావడంతో నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు యూజీసీ, ఏఐసీటీఈ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: మీ స్మార్ట్‌ ఫోన్‌ రిపేర్‌కు ఇస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి

మరిన్ని వార్తలు