Telugu Students In Ukraine: ల్యాండైన తొలి విమానం, ఉద్విగ్న క్షణాలతో ఉబ్బితబ్బిబైన..

26 Feb, 2022 21:04 IST|Sakshi

ముంబై: రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్‌ దేశంలో భయం గుప్పిట్లో గడిపిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో రుమేనియా నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానం ముంబై చేరుకుంది. ఈ విమానంలో 219 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

శనివారం బుకారెస్ట్‌ నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానంలో ఇండియాకు వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రులు ఎస్‌.జయశంకర్‌, పీయూష్‌ గోయల్‌ ముంబై ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. 

విద్యార్థులను స్వస్థలాకు తరలించేందుకు అధికారులు ముమ్మర ఏర్పట్లు చేస్తున్నారు. 219 భారతీయుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. తెలుగు విద్యార్థులు.. పోతుల వెంకట లక్ష్మీధర్‌రెడ్డి, తెన్నేటీ వెంకట సుమ, అర్ఫాన్‌ అహ్మద్‌, అమ్రితాంష్‌, శ్వేతశ్రీలు తొలి విమానంలో భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు