3 నెలలు కాల్పుల విరమణ: ఉల్ఫా (ఐ) 

16 May, 2021 11:13 IST|Sakshi

గువాహటి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో మూడు నెలల పాటు కాల్పుల విరమణను పాటించనున్నట్లు నిషేధిత యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం(ఇండిపెండెంట్‌) శనివారం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పరేష్‌ బారువా మీడియా సంస్థలకు ఒక ఈ–మెయిల్‌ పంపించారు. వచ్చే మూడు నెలలపాటు అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు.

ఉల్ఫా(ఐ) నిర్ణయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. దీనివల్ల రాష్ట్రంలో శాంతికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

(చదవండి: పంజాబ్‌లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్‌ఐల మృతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు