భార్యనే లైంగికంగా బ్లాక్‌మెయిల్‌ చేసిన భర్త.. లేఖరాసి ఆమె..

21 Oct, 2022 07:33 IST|Sakshi

కృష్ణరాజపురం: వేధింపుల భర్తతో విరక్తి చెందిన మహిళ అపార్ట్‌మెంటు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరు మహాదేవపురలో వర్తూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. 

టెక్కీలుగా పనిచేస్తూ..  
వివరాల ప్రకారం.. ఉపాసన(30), ఆమె భర్త రంజన్‌ రావత్‌ దంపతులు ఉత్తరాది నుంచి వలస వచ్చారు. దిశా అపార్ట్‌మెంటులో 9వ అంతస్తులో అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 సంవత్సరాల క్రితం   పెళ్లయింది. వేర్వేరు ఐటీ కంపెనీల్లో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై తరచూ గొడవ పడేవారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది. 

తన జీవితం ఏమాత్రం బాగాలేదని విరక్తి చెందిన ఉపాసనా రావత్‌.. డెత్‌నోట్‌ రాసి బుధవారం సాయంత్రం తన ఫ్లాటు వరండా నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి భర్త రంజన్‌ రావత్‌ను అరెస్టు చేశారు.  

డెత్‌నోట్‌లో ఏముంది?  
ఆమె ఆరు లైన్లలో ఆంగ్లంలో క్లుప్తంగా రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భర్త నన్ను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నాడు. అందుకనే నేను చనిపోతున్నా. లైంగికంగా అతడు నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి అని లేఖలో రాసి ఉంది.  

మరిన్ని వార్తలు