కేంద్ర బడ్జెట్‌: ఇందులో నాకేంటి?

2 Feb, 2021 08:51 IST|Sakshi

♦ రైతు 
మద్దతిచ్చారు... బడ్జెట్లో 
ఢిల్లీ చుట్టూ ఆందోళనలు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధరపై చట్టంలో హామీ దొరక్కపోయినా... బడ్జెట్లో దొరికింది. కాకుంటే కనీస మద్దతు ధర మరీ కనీసంగా.. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉంది!! సాగు రుణ పరిమితి లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచినా ఇవ్వాల్సింది బ్యాంకులు కదా! ‘ఆపరేషన్‌ గ్రీన్‌’ 22 ఉత్పత్తులకు విస్తరించటం  ఊరటే. చదవండి: బడ్జెట్‌ 2021: ఈ విషయాలు మీకు తెలుసా! 

♦ విద్యార్థి 
ఆన్‌లైన్‌... అర్థమైందా? 
స్కూలు బ్యాగు మోసి.. క్లాసు మొహం చూసి ఏడాదవుతోంది. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థమయ్యాయో లేదో అర్థంకాని పరిస్థితి. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైళ్లు లేనివారి గురించి ఆలోచించలేదెవ్వరూ! ఆలోచిస్తే ఈ బడ్జెట్లో మొబైల్‌ రేట్లు పెంచేస్తారా ఏంటి? మరి ఊహించని సిలబస్‌ను చూసి నష్టపోయిన పిల్లలకు ఈ బడ్జెట్లో ఏమైనా ఒరిగిందా అంటే.. అదీ లేదు. డిజిటల్‌ విద్య ఊసే లేదు. కాకుంటే మరో 15వేల కొత్త స్కూళ్లు, 100 సైనిక్‌ స్కూళ్లు తెస్తామన్నారు. ఇక.. ఉన్నత విద్య నియంత్రణకొక కమిషన్, లేహ్‌లో ఓ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎస్టీ విద్యార్థుల కోసం 750 ఏకలవ్య స్కూళ్లు ఇలా భవిష్యత్తు బాటలు చాలా ఉన్నాయ్‌. కానీ కోవిడ్‌ లాంటి వైరస్‌లు కోరలు చాస్తే..? తగిన ఆన్‌లైన్‌ పాలసీ అవసరమైతే ఉంది!. చదవండి: బడ్జెట్‌ 2021: రక్షణ రంగం కేటాయింపులు..

 ఉద్యోగి 
అయినా... పన్ను మారలేదు 
పన్ను పోటులో మార్పేమీ లేదు. కాకపోతే కొన్ని చిన్నచిన్న ఊరటలున్నాయ్‌. రిటర్నులు రీ–ఓపెన్‌ చేసే కాలాన్ని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టుల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే వడ్డీకి టీడీఎస్‌ ఉండదు. ఇక తక్కువ ధరలో ఇల్లు కొనుక్కున్న వారికి రూ.1.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ ఇచ్చే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నిర్మల సీతారామన్‌ ప్రకటించారు. పన్ను వివాద మెకానిజం మరింత సులభం చేశారు. కానీ మధ్య తరగతి ఆశగా చూసే ఆదాయపన్ను శ్లాబుల జోలికి మాత్రం వెSళ్లలేదు. పైగా అగ్రిసెస్సు కారణంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగి జేబుకు చిల్లు పడొచ్చనే ∙దిగులు వచ్చి పడింది..! చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు

♦ సీనియర్‌ సిటిజన్‌ 
ఇదేం రకం ఊరటబ్బా? 
75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు టాక్స్‌ రిటర్న్స్‌ వేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు తాజా బడ్జెట్‌లో కల్పించారు. కానీ కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్‌ సిటిజన్లకే ఈ వెసులుబాటని క్లాజ్‌ పెట్టారు. ఈ ప్రకటనతో వారికి ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే పని తప్పింది కానీ, పన్ను మాత్రం రూపాయి తగ్గలేదు. బ్యాంకులే పెన్షన్‌లో పన్ను మినహాయించేసుకుంటాయి. మరి దీన్ని ఊరట అనుకోవాలా? అయినా మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. అలాంటప్పుడు 75 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తే ఎందరికి లాభమట? 

 కార్పొరేట్స్‌ 
సూపరో.. సూపర్‌! 
కార్పొరేట్ల హ్యాపీ అంతా ఇంతా కాదు. ఆ సంతోషమంతా మార్కెట్లలో చూపించేశారు లెండి. పన్ను పెంచలేదు. పైపెచ్చు డివిడెండ్‌ మినహాయింపులు, ఇన్‌ఫ్రా డెట్‌ఫండ్స్‌ నిధులు సమీకరించుకునే వీలు, ఎన్‌ఎఫ్‌ఐటీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు, గిఫ్ట్‌ సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీకి పన్ను ప్రోత్సాహకాలు, టాక్స్‌ ఆడిట్‌ టర్నోవర్‌ పెంపు, జీఎస్‌టీ ఫైలింగ్‌ సరళీకరణ, కస్టమ్స్‌ డ్యూటీ క్రమబద్ధీకరణ, మొబైల్స్, ఐరన్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, బంగారం, వెండి, పునర్వినియోగ ఇంధన వనరుల రంగాలకు తాయిలాలు లాంటివన్నీ నవ్వులు పూయించేవే. ఇక ప్రయివేటీకరణ అంటూ అమ్మకానికి పెట్టిన ఆస్తులన్నీ కొనేది ఎలాగూ వీరే. అందుకే తాజా బడ్జెట్‌తో మార్కెట్‌ రయ్యి... మంది.

మరిన్ని వార్తలు