ఫిబ్రవరి 1వ తేదీకి లోక్‌సభ వాయిదా

29 Jan, 2021 11:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్‌, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనానుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి‌  పేర్కొన్నారు. 

లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభనుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, ఇతర సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పారు. నిర్మలా సీతారామన్‌ ఆర్థికసర్వే-2021ను  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం  ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది.

రామ్‌నాథ్‌ కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
► ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్ము కాశ్మీర్ ప్రజలకు కొత్త అధికారం దక్కింది. 
► సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈఓడీబీలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది.
► ఒకప్పుడు ఇక్కడ రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు  మాత్రమే ఉండేవి. 
►  స్మార్ట్‌ఫోన్‌ తయారీలో  ఇప్పుడు మనం ప్రపంచంలో  రెండవ స్థానంలో ఉ‍న్నాం.
►  రెరాతో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు 
► ఇస్రో గగన్ యాన్, చిన్న శాటిలైట్లను పంపే ప్రయోగాలు విజయవంతం.
► పారిశ్రమిక రంగంలో పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. 
► వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చాం.

► కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంతో, ప్రతీసభ్యుడు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా మెరుగైన సౌకర్యాలు పొందుతారు.
► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ యాదృచ్చికంటగా స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరానికి చేరుకుంటున్న తరుణంలో కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరం.
► జాతి ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.
► భార‌తదేశ సౌర్వ‌భౌమ‌త్వాన్ని కాపాడ‌టం కోసం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహరించాం.
►  గ‌ల్వాన్ లోయ‌లో గ‌త ఏడాది చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం మరువలేనిది.
► దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకుంటారు.
► కరోనా మహమ్మారి నుంచి ప్రతి పౌరుడిని కాపాడుకుంటూ,  ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నాం. 
► ఈ కరోనా టైంలోనూ ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిచింది.
► కిసాన్‌ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13వేల కోట్లు బదిలీ
► ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది
► రెండు వ్యాక్సిన్లు కూడా భారత్‌లోనే రూపొందించారు
► కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగం
► కొత్త చట్టాలతో రైతులకు విస్తృత అవకాశాలు
► రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చాం
► కొత్త చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగం
► ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి కోవింద్
► క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మనిర్భర ప్యాకేజీ వరంగా మారింది
► గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ ధ్యేయం
► రైతుల అభివృద్ధి కోసం కిసాన్ రైలు తీసుకొచ్చాం
► మత్స్యకారుల కోసం కూడా కిసాన్‌ క్రెడిట్ కార్డులు
► దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు
► జనఔషధి పరియోజన్‌ ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు చౌకగా ఔషధాలు
► వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
► మత్స్యకారుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20వేల కోట్ల వ్యయం
► 3 వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుంది
► గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం. దేశానికి ఎంతో పవిత్రమైన జాతీయ జెండాకు అవమానం జరిగింది.
►  భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కును కల్పించడంతోపాటు చట్టాలను గౌరవించాలని కూడా  రాజ్యాంగం  బోధిస్తుంది 
► ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది.
► తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం.
► కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో శక్తివంతమైన దేశంగా భారత్‌ నిలిచింది.
► ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాం.
► సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం.
► కరోనాపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం.
► సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం.
► మానవత్వంతో కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించాం.
► పేదల కోసం వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌ కార్డు అమలు చేశాం.
► జన్‌ధన్‌ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం.
► ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్‌ కల్యాణ్‌ యోజన అమలు చేశాం.
► 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం.
► దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
► దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి
► ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి.
► సన్నకారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది.
► కోటిన్నర మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్.
► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం.
► దేశంలోని 24,000 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాలను  పొందవచ్చు. 
► దేశవ్యాప్తంగా 7000 కేంద్రాల్లో పేదలు చాలా తక్కువ ఖర్చుతో మందులు పొందుతున్నారు.
► కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా  సాగుతున్న పోరులో చాలా మంది పౌరులను కోల్పోయాము. ప్రధానంగా  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాలంలోనే కన్నుమూశారు.  కోవిడ్‌ కారణంగా ఆరుగురు ఎంపీలు మనల్ని విడిచి వెళ్లారు. వారందరికి నివాళులు అర్పిస్తున్నాం.

కాగా, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్‌ బడ్జెట్‌లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు