మరో 23 వేల కోట్లు

9 Jul, 2021 02:40 IST|Sakshi

వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ప్యాకేజీ అమలు  

పిల్లల చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ వర్తింపు 

కొబ్బరి బోర్డు చట్ట సవరణకు ఓకే 

బోర్డులో గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రాతినిధ్యం 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో.. దేశంలో వైద్య రంగంలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చడం కోసం రూ. 23,123 కోట్లను సమకూర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ)లు కూడా రుణ సాయం పొందే వీలు కల్పిస్తూ తెచ్చిన పలు  ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కొత్త మంత్రి మండలి కొలువుదీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వైద్య రంగంలో మౌలిక వసతులకు సంబంధించిన ఈ ఆర్థిక ప్యాకేజీని వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు అమలు చేస్తామని కేబినెట్‌ భేటీ అనంతరం మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రులు, హెల్త్‌ సెంటర్ల ఏర్పాటు కోసం కేంద్రం గతంలో రూ. 15 వేల కోట్లను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజా ప్యాకేజీని రెండో విడతగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ నిధుల్లో
 
కేంద్రం దాదాపు రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8 వేల కోట్లను సమకూరుస్తాయి. దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రైమరీ, జిల్లా స్థాయిల్లో వైద్య వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇందులో భాగంగా, 2.4 లక్షల సాధారణ బెడ్స్‌ను, 20 వేల ఐసీయూ బెడ్స్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం బెడ్స్‌లో 20 శాతం పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో మెడికల్‌ ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు స్టోరేజ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కరోనా నియంత్రణ, కోవిడ్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. కోవిడ్‌ నుంచి పిల్లలను రక్షించడం, సంబంధిత మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్‌ యూనిట్స్‌ను, ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో పిల్లల కోసం ‘పీడియాట్రిక్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేస్తారు.

మార్కెట్‌ కమిటీలకు రుణ సదుపాయం
లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నుంచి రుణాలు పొందేందుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. మార్కెట్ల సామర్ధ్య పెంపునకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. మార్కెట్‌ కమిటీలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ నిధులు ఉపయోగపడ్తాయన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్‌ కమిటీలు మూతపడ్తాయన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ ‘గత ఏడాది ప్రధాన మంత్రి రూ. లక్ష కోట్ల మేర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రకటించారు. ఇది ఏపీఎంసీకి కూడా వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ దిశగా చేసిన పలు మార్పులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది’ అని వివరించారు.  ఏపీఎంసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, జాతీయ, రాష్ట్ర సహకార సమాఖ్యలు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా వీటిని వాడుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ. 2 కోట్ల వరకు రుణం లభిస్తుంది. దీనిపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలైతే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ని యూనిట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రయివేటు సంస్థలైతే గరిష్టంగా 25 యూనిట్లకు మాత్రమే ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఏపీఏంసీలు తమ మార్కెట్‌ యార్డ్‌ పరిధిలో కోల్డ్‌ స్టోరేజ్, సార్టింగ్, గ్రేడింగ్‌ తదితర విభిన్న రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుకు రూ. 2 కోట్ల రుణం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు.

కొబ్బరి బోర్డులో ఏపీ, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం 
కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం–1979లో సవరణలు చేస్తూ వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌ పోస్టును నాన్‌ ఎగ్జిక్యూటిక్‌ పోస్టుగా మార్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ మార్పు ద్వారా అర్థం చేసుకునే వీలుంటుందని, ఈ నిర్ణయం కొబ్బరి రైతులకు మేలు చేస్తుందని నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అలాగే బోర్డులో కేంద్రం నామినేట్‌ చేసే సభ్యుల్లో నాలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉందని, దీనిని ఆరుగురికి పెంచామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రి తెలిపారు. 

కేంద్రం దాదాపు రూ. 15 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8 వేల కోట్లను సమకూరుస్తాయి. దేశవ్యాప్తం గా 736 జిల్లాల్లో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ప్రైమరీ, జిల్లా స్థాయిల్లో వైద్య వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇందులో భాగంగా, 2.4 లక్షల సాధారణ బెడ్స్‌ను, 20 వేల ఐసీయూ బెడ్స్‌ ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం బెడ్స్‌లో 20% పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో మెడికల్‌ ఆక్సిజన్‌ను నిల్వ చేసేం దుకు స్టోరేజ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కరోనా నియంత్రణ, కోవిడ్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. కోవిడ్‌ నుంచి పిల్లలను రక్షించడం, సంబంధిత మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంపై ఇందులో ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్‌ యూని ట్స్‌ను, ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో పిల్లల కోసం ‘పీడియాట్రిక్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేస్తారు.

మార్కెట్‌ కమిటీలకు రుణ సదుపాయం
లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక వసతుల నిధి(అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నుంచి రుణాలు పొందేందుకు వ్యవసాయ మార్కెట్‌ కమి టీలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. మార్కెట్ల సామర్థ్య పెంపునకు, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చన్నారు. మార్కెట్‌ కమిటీలు మరింత బలోపేతమయ్యేం దుకు ఈ నిధులు ఉపయోగపడ్తాయన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్‌ కమిటీలు మూతపడ్తాయన్న రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ ‘గత ఏడాది ప్రధాన మంత్రి రూ. లక్ష కోట్ల మేర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రకటించారు. ఇది ఏపీఎంసీకి కూడా వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ దిశగా చేసిన పలు మార్పులకు కేబి నెట్‌ ఆమోదం తెలిపింది’ అని వివరించారు.  ఏపీఎంసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, జాతీయ, రాష్ట్ర సహకార సమాఖ్యలు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా వీటిని వాడుకోవచ్చు. ఒక యూనిట్‌కు రూ. 2 కోట్ల వరకు రుణం లభిస్తుంది. దీనిపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలైతే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ని యూనిట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రైవేటు సంస్థలైతే గరిష్టంగా 25 యూనిట్లకు మాత్రమే ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం పొందవచ్చు. ఏపీఏంసీలు తమ మార్కెట్‌ యార్డ్‌ పరిధిలో కోల్డ్‌ స్టోరేజ్, సార్టింగ్, గ్రేడింగ్‌ తదితర విభిన్న రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుకు రూ. 2 కోట్ల రుణం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు.

కొబ్బరి బోర్డులో ఏపీ, గుజరాత్‌లకు ప్రాతినిధ్యం 
కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టం–1979లో సవరణ లు చేస్తూ వ్యవసాయ శాఖ తెచ్చిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌ పోస్టును నాన్‌ ఎగ్జిక్యూటిక్‌ పోస్టుగా మార్చింది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ మార్పు ద్వారా అర్థం చేసుకునే వీలుంటుందని, ఈ నిర్ణ యం కొబ్బరి రైతులకు మేలు చేస్తుందని నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అలాగే బోర్డులో కేంద్రం నామినేట్‌ చేసే సభ్యుల్లో 4 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉందని, దీనిని 6కు పెంచామని, ఇకపై ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రి తెలిపారు. 

ముఖ్యమైన నిర్ణయాలు: మోదీ


రైతుల సంక్షేమం కోసం కొన్ని ముఖ్య మైన నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఇకపై వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించవచ్చన్నారు. కోవిడ్‌–19 ప్యాకేజ్‌తో చిన్న పిల్లల కరోనా చికిత్సకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నామన్నారు. జిల్లా స్థాయిలో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్‌ స్టోరేజ్, అంబులెన్స్, ఔషధాల అందుబాటు.. మొదలైన సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం ప్రధాని పలు వరుస ట్వీట్లు చేశారు.  

మరిన్ని వార్తలు