ఎస్సీ విద్యార్థులపై కేంద్రం వరాలు

23 Dec, 2020 18:22 IST|Sakshi

స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థులకు భారీగా పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు అందించేందుకు కేంద్రం‌ సిద్ధమైంది. ఈమేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ స్కాలర్‌షిప్‌ మొత్తాన్నిఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు రూ.59 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు తెలిపింది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతంగా అంటే రూ.35,534 కోట్లుగా ఉండగా మిగిలిన వాటా రాష్ట్రాలదే బాధ్యత అని స్పష్టం చేసింది. డీటీహెచ్‌ సర్వీసుల మార్గదర్శకాలను సైతం సవరించింది. ఇక నుంచి 20 ఏళ్లకు ఒకసారి డీటీహెచ్‌ సర్వీస్‌ లైసెన్స్‌ ఉంటుందని, ప్రతి మూడు నెలలకోసారి లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని వివరించింది. డీటీహెచ్‌ ఆపరేటర్ల మధ్య మౌలిక సదుపాయాల షేరింగ్‌కు అనుమతినిచ్చింది. (చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్‌)

ఎల్లుండి పీఎం కిసాన్‌ నిధులు విడుదల
నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పలు విభాగాలను విలీనం చేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌ఎఫ్‌డీసీలో ఫిల్మ్‌ డివిజన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ విలీనాలను ఆమోదించింది. ఇదిలా వుండగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి తదుపరి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రూ.9 కోట్లకు పైగా రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆరు రాష్ట్రాల రైతులతో మాట్లాడనున్నారు. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలను వివరించనున్నారు. (చదవండి: స్పెక్ట్రమ్‌ వేలానికి సై!)

మరిన్ని వార్తలు