ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్‌ ప్రకటించిన కేంద్రం

12 Oct, 2022 16:09 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.  అయితే ఇది పర్మామెన్స్ ఆధారిత బోనస్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 11.27లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్మామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే తెలిపింది.

అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్‌(సవరణ)బిల్లు-2022కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
చదవండి: శశి థరూర్‌తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు