కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

19 Aug, 2020 10:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం10:30 గంటలకు ప్రారంభమైంది. మంత్రివర్గ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగటం ఇదే తొలిసారి. పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడడంతో మంత్రివర్గ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చెరుకు మద్దతు ధర పెంపు, జైపూర్, గౌహతి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టలకు సంబంధించి పీపీపీ విధానంలో లీజ్, సబార్డినేట్ ఉద్యోగాల నియామకానికి జాతీయ నియామక సంస్థ ఏర్పాటు, ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలకు కనీస ఉమ్మడి ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ కోసం ‘మిషన్ కర్మయోగి’ ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు